శ్రీవారి సేవలో‌ విశాఖ శారదపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి..

తిరుమల శ్రీవారిని విశాఖ శారదపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు.శనివారం ఉదయం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి కి టిటిడి ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

 Swaroopanandendra Swamy Darshans Tirumala Temple, Swaroopanandendra Swamy ,tirum-TeluguStop.com

దర్శనంతరం రంగనాయకుల మండపంలో టిటిడి అధికారులు స్వరూపనందేంద్ర సరస్వతి, స్వాత్వానంద సరస్వతిలకు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేసారు.

అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ.

హర్యానాలోని కురుక్షేత్రంలో లక్ష చండి యాగం నిర్వహించడం జరిగిందన్నారు.దేశంలో ఎప్పుడు చేయని విధంగా నిర్వహించాంమని, కాణిపాకంలో లక్ష మోదుక యాగం నిర్వహిస్తున్న తరుణంలో తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు.

రాజశ్యామ అమ్మవారి శక్తి వల్లే లక్ష చండి యాగం నిర్వహించే బాధ్యత శారద పీఠానికి దక్కిందన్నారు.దేశంలో ఈ భాగ్యం మరో పీఠానికి దక్కలేదని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube