బాలయ్య తప్పు చేయలేదు.. ఎస్వీఆర్ కుటుంబ సభ్యుల కామెంట్స్ విన్నారా?

సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రస్తుతం బాలయ్య చేసింది తప్పా? కాదా? అనే చర్చ జోరుగా జరుగుతోంది.

ఎక్కువమంది బాలయ్య చేసింది తప్పేనని చెబుతుండగా కొంతమంది మాత్రం బాలయ్య చేసింది తప్పు కాదని చెబుతుండటం గమనార్హం.

అయితే అక్కినేని ఫ్యామిలీతో పాటు ఎస్వీఆర్ ఫ్యామిలీ గురించి బాలయ్య కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటన గురించి ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

బాలయ్య ఎలాంటి తప్పు చెయ్యలేదని ఆయన చేసిన కామెంట్ల విషయంలో ఎలాంటి తప్పు లేదని ఎస్వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొచ్చారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడిన మాటల గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయని అయితే ఎస్వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ గా, మనవళ్లుగా మేము ఒకటే చెప్పాలని అనుకుంటున్నామని వాళ్లు కామెంట్ చేశారు.

బాలయ్యతో మాకు మంచి అనుబంధం ఉందని మేము కుటుంబంలా ఉంటామని వాళ్లు వెల్లడించారు.

Advertisement

ఒక నటుడితో జరిగిన సంభాషణ గురించి బాలయ్య చాలా సరదాగా చెప్పడం జరిగిందని బాలయ్య చేసిన కామెంట్ల విషయంలో మాకు ఎలాంటి వివాదం కనిపించడం లేదని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని మరింత పెద్దది చేయొద్దని వాళ్లు కోరారు.రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని ఆ అనుబంధాన్ని విడదీసే విధంగా వ్యవహరించవద్దని వాళ్లు కోరారు.

బాలయ్యకు అనుకూలంగా ఎస్వీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన కామెంట్ల విషయంలో ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.అక్కినేని ఫ్యాన్స్ మాత్రం బాలయ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.బాలయ్య మాత్రం ఈ వివాదం విషయంలో తనకు క్షమాపణలు చెప్పే ఆలోచన లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూనే ఈ వివాదం గురించి స్పందించకుండా జాగ్రత్తగా బాలయ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

Advertisement

తాజా వార్తలు