భార్యపై అనుమానంతో పసిబిడ్డకు విషం ఇచ్చిన భర్త..!

ఇటీవలే అనుమానాలు దారుణమైన అఘాయిత్యాలకు కారణం అవుతున్నాయి.ఇక వివాహేతర సంబంధం( extramarital affair ) ఉందనే అనుమానం వస్తే చివరికి కుటుంబం నాశనం అవ్వాల్సిందే.

ఇలాంటి క్రమంలోనే ఓ భర్తకు తన భార్యపై అనుమానం వచ్చింది.పుట్టిన పసిబిడ్డకు తాను తండ్రి కాదని భావించిన ఆ వ్యక్తి విషం ఇచ్చి ఆ పసి బిడ్డను చంపే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం ఆ చిన్నారి మృత్యువుతో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఒడిశా లోని బాలాసోర్( Balasore ) లో నివాసం ఉండే చందన్( Chandan ) అనే యువకుడికి తన్మయి అనే యువతితో ఓ ఏడాది క్రితం వివాహం అయింది.ఈ దంపతులకు మే తొమ్మిదిన ఆడ శిశువు జన్మించింది.

Advertisement

అయితే తన భార్యకు పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆ వ్యక్తి వల్లే తన భార్య గర్భం దాల్చిందని అనుమానం పెంచుకున్నాడు.అంతేకాకుండా ఆ పుట్టిన బిడ్డకు తాను తండ్రి కాదు అని భావించి ఆ బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

తన్మయి హాస్పటల్( Tanmai Hospital ) నుంచి డిస్చార్జ్ అయ్యి పుట్టింటికి వెళ్ళింది.సోమవారం భార్యాబిడ్డలను చూసేందుకు చందన్ భార్య పుట్టింటికి వెళ్ళాడు.ఇక తన్మయి బిడ్డ పక్కన లేని సమయంలో పురుగుల మందును సిరంజి ద్వారా బిడ్డ శరీరంలోకి ఎక్కించాడు.

అప్పుడు ఆ బిడ్డ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టింది.బిడ్డ ఏడుపు విని తన్మయి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి భర్త చేతుల్లో సిరంజి, పక్కనే పురుగుల మందు సీసా కనిపించింది.

బిడ్డను ఏం చేశావని తన్మయి నిలదీయగా తానేమి చేయలేదని బుకాయించాడు.తన్మయి ఆలస్యం చేయకుండా తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వెంటనే బిడ్డను బాలాసోర్ ఆస్పత్రికి తరలించారు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
బస్సుల్లో గేమ్ ఛేంజర్ పైరసీ ప్రింట్ ప్రదర్శన.. చరణ్ కు టైం అస్సలు బాలేదా?

ప్రస్తుతం బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు