మెగాస్టార్ తో సుస్మిత..!

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే హీరోలంతా దాదాపు ఓ క్రికెట్ జట్టుకి సరిపడేంత ఉండగా ఆ ఫ్యామిలీ లేడీస్ కూడా సినిమాకు సంబందించిన రంగాల్లోనే ఉన్నారు.మెగా బ్రదర్ నాగ బాబు డాటర్ నిహారిక హీరోయిన్ గా కొన్ని ప్రయత్నాలు చేసింది.

 Susmitha Kondela Megastar Chiranjeevi Movie , Chiranjeevi , Susmitha Kondela , A-TeluguStop.com

ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె ప్రొడ్యూసర్ గా కొనసాగాలని చూస్తుంది.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయురాలు సుస్మిత కూడా కాస్టూం డిజైనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

కాస్టూం డిజైనర్ గా ఖైది నెంబర్ 150, రంగస్థలం, ఆచార్య సినిమాలకు పనిచేసింది సుస్మిత.

ఇదేకాదు తన హస్బండ్ విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వెబ్ సీరీస్, సినిమాలను కూడా నిర్మిస్తుంది.

ఇక లేటెస్ట్ గా సుస్మిత తన ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతుందని టాక్.వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు తన నెక్స్ట్ కమిట్ మెంట్ కూతురు ప్రొడక్షన్ లో చేస్తానని చెప్పారట.

అయితే ఆ ప్రాజెక్ట్ డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.మొత్తానికి మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా కొనసాగాలని చూస్తుందని చెప్పొచ్చు. మెగాస్టార్ తర్వాత తమ్ముడు చరణ్ తో కూడా సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ లో సినిమా ఉంటుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube