మెగాస్టార్ తో సుస్మిత..!

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే హీరోలంతా దాదాపు ఓ క్రికెట్ జట్టుకి సరిపడేంత ఉండగా ఆ ఫ్యామిలీ లేడీస్ కూడా సినిమాకు సంబందించిన రంగాల్లోనే ఉన్నారు.

మెగా బ్రదర్ నాగ బాబు డాటర్ నిహారిక హీరోయిన్ గా కొన్ని ప్రయత్నాలు చేసింది.

ఆఫ్టర్ మ్యారేజ్ ఆమె ప్రొడ్యూసర్ గా కొనసాగాలని చూస్తుంది.ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయురాలు సుస్మిత కూడా కాస్టూం డిజైనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.

కాస్టూం డిజైనర్ గా ఖైది నెంబర్ 150, రంగస్థలం, ఆచార్య సినిమాలకు పనిచేసింది సుస్మిత.

ఇదేకాదు తన హస్బండ్ విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో వెబ్ సీరీస్, సినిమాలను కూడా నిర్మిస్తుంది.

ఇక లేటెస్ట్ గా సుస్మిత తన ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతుందని టాక్.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు తన నెక్స్ట్ కమిట్ మెంట్ కూతురు ప్రొడక్షన్ లో చేస్తానని చెప్పారట.

అయితే ఆ ప్రాజెక్ట్ డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఇంకా నిర్ణయించలేదు.మొత్తానికి మెగా డాటర్ సుస్మిత నిర్మాతగా కొనసాగాలని చూస్తుందని చెప్పొచ్చు.

 మెగాస్టార్ తర్వాత తమ్ముడు చరణ్ తో కూడా సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్ లో సినిమా ఉంటుందని చెప్పొచ్చు.

అమరావతిపై కీలక నిర్ణయం.. శ్వేతపత్రం విడుదల