రామ్ చరణ్ పిల్లల విషయంలో తీరని సుస్మిత కోరిక.. కోరికగానే మిగిలిపోవాల్సిందేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన ( Upasana ) దంపతులకు మంగళవారం తెల్లవారుజామున ఆడపిల్ల జన్మించిన విషయం మనకు తెలిసిందే.

పెళ్లయిన దాదాపు పది సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తెలియచేశారు.

ఇలా ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఉపాసనకు కొడుకు( Baby Boy ) పుట్టాలని ఆమెకు కొడుకు పుడితే మెగా లెగిసి ఇండస్ట్రీలో అలాగే కొనసాగుతూ ఉంటుందని అభిమానులు భావించారు.ఇలా వారసుడు పుట్టాలని కోరుకున్నప్పటికీ రామ్ చరణ్ దంపతులకు వారసురాలు( Varasuralu ) జన్మించింది.

ఇకపోతే రామ్ చరణ్ సోదరి సుస్మిత( Sushmitha ) ఒకానొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ రామ్ చరణ్ కు కొడుకు పుడితే బాగుంటుందని మేనత్తగా ఈమె ఆశపడ్డారు.తమకు ఎవరు పుట్టినా ఒకటేనని కాకపోతే తమ ఇంట్లో ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు కనుక చరణ్ కు కొడుకు పుడితే బాగుంటుంది అని ఆశపడ్డారు.ఇలా సుస్మిత చరణ్ కు కొడుకే పుట్టాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టారు.

అయితే తాజాగా రాంచరణ్ కు కూతురు పుట్టడంతో సుస్మిత కోరిక నెరవేరలేదని తెలుస్తోంది.

Advertisement

అయితే మరో సంతానంలో అయినా రామ్ చరణ్ కు మగపిల్లాడు పుడతారని మెగా వారసత్వం కొనసాగుతుందని అభిమానులు భావిస్తున్నారు.కానీ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి( Venu Swamy ) మాత్రం రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరో సంతానం లేదని ఒకవేళ ఉన్న మగ సంతానం ఉండదు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో సుస్మిత కోరిక అలా కోరికగానే మిగిలి పోతుందా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ దంపతులకు కుమార్తె పుట్టడంతో మెగా ఫ్యామిలీ మాత్రం చాలా సంతోషంగా సంబరం చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు