తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి(Mega Family) ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు గురించి పరిచయం అవసరం లేదు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి(Chiranjeevi) తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా సామ్రాజ్యాన్ని విస్తరింప చేశారు.
ఇలా ఎంతోమంది మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత (Susmitha) కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.
మొదట్లో ఈమె చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు.అనంతరం నిర్మాతగా మారిపోయారు.
ఇలా ఈమె ఇప్పటికే పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మించిన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా నిర్మాతగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి సుస్మిత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక నిర్మాతగా తాను ఎప్పటికైనా తన తండ్రితో కలిసి ఒక సినిమా చేయడమే తనకాల అంటూ ఇదివరకు ఈమె పలుసార్లు తెలియజేశారు.ఈ క్రమంలోనే చిరంజీవితో ఒక మంచి సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి తన తదుపరిచిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ(Kalyan Krishna) దర్శకత్వంలో చేయబోతున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు సుస్మిత నిర్మాతగా వ్యవహరించబోతున్నారని తెలిసి కొంతమంది బడా నిర్మాతలు ఆమెకు గోల్డెన్ ఆఫర్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే కొందరు నిర్మాతలు ఈ సినిమాకు బడ్జెట్ మొత్తం తామే కేటాయిస్తామని కేవలం లాభాలలో తమకు వాటాలు కావాలని అడిగారట.ఈ విధంగా ఈమెకు మంచి ఆఫర్ రావడంతో చిరంజీవి కూడా ఇందుకు ఓకే చెప్పమని తన కూతురికి సలహా ఇచ్చిన ఈమె మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది.ఎప్పటినుంచో తనుకు తన తండ్రితో సినిమా చేయడమే ఒక కల అలాంటి కల నెరవేరుతున్న సమయంలో ఆ సినిమాలోకి ఇతరులను భాగస్వామ్యం చేసుకోనని సొంతంగా తానే నిర్మిస్తాను అంటూ సుస్మిత మొండి పట్టు పట్టారని తెలుస్తుంది.అయితే చిరంజీవి మాత్రం తన కూతురికి అర్థమయ్యేలా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.