పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఆది పురుష్( Adipurush ) .ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగా రాబడుతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి (Ramudu)పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం కేవలం ప్రభాస్ ని మాత్రమే ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగి ఉంటుంది.అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించడానికి ప్రభాస్ ను మాత్రమే ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్నటువంటి కారణాన్ని డైరెక్టర్ తెలియజేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఓం రౌత్( Om Rauth ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఈ సినిమాలో ప్రభాస్ ను రాముని పాత్రలో ఎంపిక చేసుకోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఈ సినిమా చేయాలి అనుకున్న సమయంలో తన మదిలో మెదిలినటువంటి హీరో ప్రభాస్ మాత్రమేనని తెలిపారు.అయితే ఈయనని ఈ సినిమా కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డానని ఓం రౌత్ వెల్లడించారు.
ఈ సినిమా కొత్త తరం వారి కోసం తీసే సినిమా.మొత్తం రామాయణాన్ని తెరపై చూపించడం సాధ్యం కాదు కనుక తాను యుద్ధకాండను మాత్రమే తీసుకున్నానని అది అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపారు.

ఇందులో రాముడు చాలా పరాక్రమంతుడిగా కనిపిస్తారు.తన కళ్ళల్లో నీతి నిజాయితీ కూడా ఉంటుంది.హృదయంలోని భావాలు కళ్ళల్లో కనిపిస్తాయి.ఇలా ఈ పాత్ర అనుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా ప్రభాస్ లో స్పష్టంగా ఉన్నాయని, ఆయన ఒక పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా వినయంగా ఉంటారని తనని ఎంపిక చేసామని ఓం రౌత్ తెలిపారు.
అయితే ఈ విషయం మొదట ప్రభాస్ కి చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.తనని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసాను.ఇక తనని కలిసి కథ వినిపించడంతో ప్రభాస్ కూడా ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యారంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







