హీరో ఆత్మహత్య కేసులో కీలక విషయం గుర్తింపు

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ ఆత్మహత్య కేసును ముంబయి పోలీసులు విచారిస్తున్నారు.

విచారణలో భాగంగా ఇప్పటి వరకు సినీ ప్రముఖులు ఇంకా ఆయన వద్ద పని చేసే స్టాప్‌ తో కలిపి మొత్తం 30 మంది వరకు ప్రశ్నించారట.

త్వరలో సంజయ్‌ లీలా భన్సాలీతో పాటు యశ్‌ చోప్రాను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.మరో వైపు సుశాంత్‌ పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ ఇంకా ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ను పోలీసులు విశ్లేశిస్తున్నారు.

పోలీసులు తాజాగా సుశాంత్‌ ఫోన్‌ డేటాను ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో విశ్లేషించగా ఆసక్తికర విషయాలు బయట పడ్డాయట.సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి కొంత సమయం ముందు తన పేరును గూగుల్‌లో సెర్చ్‌ చేశాడట.

తన గురించి మీడియాలో వస్తున్న కొన్ని అసత్య కథనాలపై తీవ్రంగా మనసు కలత చెందడం వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఆ సమయంలోనే కాకుండా సుశాంత్‌ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు గూగుల్‌ చేస్తూ ఉండేవాడట.

Advertisement

తనపై వస్తున్న కథనాల గురించి తన అసిస్టెంట్స్‌తో చర్చించి తప్పుగా ఉన్న వాటిపై చర్చించే వారట.ఇటీవల సుశాంత్‌ ప్రేమ విషయమై మీడియాలో వస్తున్న వార్తలు తారా స్థాయికి చేరాయి.ఆయన ప్రేమ గురించి రియా చక్రవర్తి స్పందించిన తీరు కూడా ఆత్మహత్యకు కారణం అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి సుశాంత్‌ ఫోన్‌ డేటా అనేక కొత్త అనుమానాలకు తావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు