తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లాకు చెందిన క్రాంతి గురించి కొన్ని రోజుల క్రితం ఎవరికి పెద్దగా తెలియదు.కాని ఇప్పుడు అతడి గురించి ప్రపంచమే ఆశ్చర్యంగా తెలుసుకునేందుకు నెట్ లో సెర్చ్ చేస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకర సాహసాలు చేసే వ్యక్తుల్లో క్రాంతి ఒక్కడిగా నిలిచాడు.28 ఏళ్ల ఈ కుర్రాడు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు.ఇతడు చేసే సాహసాలకు ఒల్లు గగుర్లు పొడిపించక మానవు.ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చిన క్రాంతి తాజాగా ఇండియా గాట్ ట్యాలెంట్ షో ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ఇండియా వ్యాప్తంగా ఇతడి గురించిమాట్లాడుకుంటున్నారు.
ఇంతకు క్రాంతి ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం.
చెక్కలకు, గోడలకు డ్రిల్ చేసే డ్రిల్ మిషన్‌తో ఈతని సాహసం ఉంటుంది.డ్రిల్ మిషన్ ను ఏకంగా మక్కులోకి దించుకుంటాడు.చుక్క రక్తం బోట్టు రాకుండా ముక్కులోకి ఇతగాడు డ్రిల్ చేసుకుంటాడు.డ్రిల్ మిషన్ మొత్తంను కూడా ముక్కులోనికి దూర్చుకుంటాడు.
ఇండియా గాట్ ట్యాలెంట్ షోలో ఇతగాడు చేసిన సాహసం ఆహుతులను సైతం అబ్బురపర్చింది.గెస్ట్‌లు షాక్ అయ్యి మరీ నిల్చుని ఇతగాడికి చప్పట్లు కొట్టారు.
డ్రిల్ మిషన్‌ను పట్టుకోవడమే కష్టం.ఇలాంటిది ఏకంగా ముక్కులోకి పెట్టుకోవడం ఏంటీ అంటూ అవాక్కవుతున్నారా.
దీనికే ఇలా అనుకుంటే ఎలా ఇతగాడు చేసే సాహసాలు ఇంకా చాలానే ఉన్నాయి.

32 కత్తులను కడుపులోకి పంపిస్తాడు.అవి కూడా చిన్నా చితకా కత్తులు కావు, ఏకంగా రెండు ఫీట్స్ ఉండే 32 కత్తులు.వింటుంటేనే బాబోయ్ అనిపించేలా ఉన్నా కూడా ఇది నిజంగా అతిడు సాధ్యం.32 కత్తులను కూడా నోట్లో పెట్టుకుని చుక్క రక్తం బొట్టు రాకుండా జాగ్రత్తగా తీస్తాడు.
మరిగే నీటిలో చేయి పెడతాడు, వాటిని తాగుతాడు కూడా, అయినా ఇతగాడికి ఏమీ కాదు.
ఇక తుఫాన్, బొలేరో వంటి వాహనాలను తన ముక్కుమీదనుండి పోనిచ్చుకున్న ఘనత కూడా ఇతనిదే.
ఇంతటి ప్రతిభ ఉన్న క్రాంతిని అమెరికా గాట్ టాలెంట్ షోలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లాడు.
ఇప్పటికే అక్కడ ఆడిషన్స్ అయ్యాయి.త్వరలోనే అక్కడ క్రాంతి షో ఉండబోతుంది.
అమెరికా గాట్ టాలెంట్ షోలో ఇంకా కొన్ని కొత్త వాటి చూపుతాడట.

ఇంత గొప్ప సాహస వీరుడిని మనం ఎంత మెచ్చుకున్నా తక్కువే.ఇదడి గురించి మరికొంతమందికి చెప్పడం మన కనీస బాధ్యత.తప్పకుండా షేర్ చేయండి.
