టాలీవుడ్ లో ఒకప్పుడు అక్కినేని హీరోలు అంటే ఒక బ్రాండ్ ఉండేది.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.
ఇతర హీరోల ముందు అక్కినేని ఫ్యాన్స్ తేలిపోతున్నారు.నాగార్జున టైం అయిపోయింది.
ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నా కూడా అడపా దడపా సక్సెస్‌లు పడుతున్నాయి, అవి కూడా యంగ్ స్టార్ హీరోల స్థాయిలో ఉండటం లేదు.ఇక నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్‌లు అయినా తమ సత్తా చాటి యంగ్ స్టార్ హీరోలకు పోటీ ఇస్తారనుకుంటే వారు కూడా నిరాశ పర్చుతున్నారు.
నాగచైతన్య ఇప్పటికే సెకండ్ ర్యాంక్ హీరోగా సెటిల్ అయ్యాడు.అఖిల్ అయినా టాప్ ర్యాంక్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుంటాడేమో అనుకున్నారు.
కాని అఖిల్ కూడా అదే సెకండ్ గ్రేడ్ హీరోల సెటిల్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.

అఖిల్ మొదటి సినిమాతోనే స్టార్ అవుతాడని అంతా భావించారు.మొదటి సినిమాను స్టార్ హీరో సినిమా స్థాయిలో నిర్మించడంతో పాటు ప్రమోట్ చేశారు.కాని అఖిల్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఆ తర్వాత హలో, తాజాగా మిస్టర్ మజ్ను చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.దాంతో నాల్గవ సినిమా ఏంటా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలోనే అఖిల్ నాల్గవ సినిమా గురించిన ఆసక్తికర వార్తలు మీడియాలో వస్తున్నాయి.

అఖిల్ నాల్గవ సినిమా సత్య పినిశెట్టి దర్శకత్వంలో ఉంటుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.కాని ఇప్పుడు అఖిల్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.కొరటాల, సుకుమార్, త్రివిక్రమ్ లలో ఒకరితో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు అఖిల్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
వారు ఇప్పటికే పలు సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు.ఈయనతో సినిమా చేయాలంటే రెండు మూడు సంవత్సరాలు అయినా పడుతుంది.
ఈ సమయంలో అంతటి బ్రేక్ తీసుకుంటే అఖిల్ కెరీర్ మొదటికేమోసం వస్తుందనేది కొందరి వాదన.మరి అఖిల్ ఏం చేస్తాడో చూడాలి.







