అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పిన స్టార్‌ హీరో.. ఊపిరి పీల్చుకుంటున్నారు

కరోనా కారణంగా ఎంతో మంది స్టార్‌ హీరోలు మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడ్డ సందర్బాలు ఉన్నాయి.

అమితాబచ్చన్‌ నుండి మొదలుకుని పెద్ద చిన్న హీరోలు చాలా మంది కరోనా బారిన పడ్డారు.

ఇటీవలే తమిళ స్టార్‌ నటుడు సూర్య కూడా కరోనా బారిన పడ్డాడు.ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్‌ మీడియాలో అభిమానులతో షేర్‌ చేసుకుని అందరికి షాక్‌ ఇచ్చాడు.

సూర్య కరోనా నుండి తేరుకోవాలని అభిమానులు పూజలు చేశారు.ఎట్టకేలకు అభిమానుల పూజలు ఫలించాయి.

అభిమానులు కోరుకున్నట్లుగా సూర్య కరోనా నుండి తేరుకున్నాడు.తాజాగా ఆయన టెస్టు తాజా రిపోర్టులు వచ్చాయి అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Advertisement

కరోనా నుండి సూర్య పూర్తిగా కోలుకున్నాడు అని ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ఇప్పుడు కరోనాతో భాధ పడటం లేదు అంటూ తమిళ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి.సూర్య కరోనా బారిన పడటం వల్ల తదుపరిస సినిమా విషయంలో కాస్త ఆలస్యం జరిగింది.

షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా బారిన పడటం వల్ల దాదాపు నెల రోజులుగా షూటింగ్‌ కు ఆయన హాజరు కాలేక పోయాడు.మరో నెల రోజుల పాటు సూర్య పూర్తి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు.

అందుకే ఆయన తో సినిమా చేయబోతున్న దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు.వచ్చే నెలలో సూర్య కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది.

గత ఏడాది ఈయన నటించిన ఆకాశమే హద్దుగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కనుక తదుపరి సినిమా విషయమై తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?

ఇలాంటి సమయంలో ఆయన కరోనా బారిన పడటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పుడు కరోనా ఫ్రీ అవ్వడంతో ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు