కళ్యాణి ఆస్తులకు నాకు సంబంధం లేదు.. ఆస్తి మొత్తం నాదే: సూర్య కిరణ్

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమలో పడటం విడిపోవటం సర్వసాధారణం.అయితే వీరు ఎంత తొందరగా ప్రేమలో పడతారో అంతే తొందరగా విడిపోవడం కూడా జరుగుతుంది.

ఇప్పటికే ఎంతో మంది ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని విడిపోయిన వారు ఉన్నారు.ఇలాంటి వారిలో నటి కళ్యాణి దర్శకుడు సూర్యకిరణ్ ఒకరు.

సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటుడిగా ఎన్నో సినిమాలలో నటించారు.అయితే ఈయన సత్యం సినిమా ద్వారా డైరెక్టర్ గా మారిపోయారు.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో ఈయన తన సినీ కెరియర్లో ఏ విధమైనటువంటి డోకా ఉండదని భావించారు.సూర్య కిరణ్ దర్శకత్వంలో వచ్చిన సత్యం సినిమా మినహా మిగిలిన సినిమాలన్నీ ఆయనకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.

Advertisement

ఈ విధంగా తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ వరుస ప్లాప్ కావడంతో ఈయనకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.అయితే అప్పటికే ఈయన నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఇలా వీరికి ఆర్థిక ఇబ్బందులు రావడంతో కళ్యాణి ఆస్తులు కూడా ఈయన పోగొట్టారని అందుకే వీరిద్దరు విడిపోయారని వార్తలు వచ్చాయి.

అయితే విరివిడాకులు అనంతరం చాలా సంవత్సరాలకు ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్యకిరణ్ తన విడాకుల గురించి అలాగే ఆస్తుల గురించి వివరించారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ.నాకు హైదరాబాద్ కేరళలో ఉన్న ఆస్తులన్నీ కూడా పోయాయి ఇక నేను కళ్యాణి ఇద్దరం కలిసి ఒక బోట్ హౌస్ కొన్నాము.

అది మాత్రమే నేను తీసుకున్నానని, కానీ కళ్యాణి ఆస్తులు తాను ముట్టుకోలేదని ఈ సందర్భంగా సూర్య కిరణ్ క్లారిటీ ఇచ్చారు.ఇకపోతే కళ్యాణి ఆస్తి వ్యవహారాలన్నీ తన తల్లి మేనేజ్ చేస్తుందని అయితే ఆ విషయంలో తనని ఏమాత్రం తప్పు పట్టనని సూర్యకిరణ్ వెల్లడించారు.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇక్కడ తన చెల్లి ఆస్తులను తన తల్లి మేనేజ్ చేస్తుందని అలాగే కళ్యాణి ఆస్తులను కూడా వాళ్ళ అమ్మ మేనేజ్ చేస్తుంది అంటూ సూర్యకిరణ్ ఈ సందర్భంగా తెలిపారు.కళ్యాణి ఆస్తులను పోగొట్టాననే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని కిరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు