కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇలా సూర్య నటించిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాయి.
ఇక సూర్యకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఇక్కడ కూడా సూర్య సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నాయి.సూర్య తాజాగా శివ ( Shiva ) దర్శకత్వంలో కంగువ ( Kanguva ) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో భారీ బడ్జెట్ చిత్రంగా ఏకంగా 10 భాషలలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.ఇలా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల( Digital Rights ) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోయాయని సమాచారం.
వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకు అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prim e) భారీ ధరలకు కొనుగోలు చేశారని తెలుస్తోంది.తమిళం తెలుగు మలయాళ కన్నడ భాషలకు కలిపి ఏకంగా 80 కోట్ల రూపాయల భారీ ఆఫర్ చేశారని తెలుస్తోంది.
ఇలా అమెజాన్ వారు ఈ సినిమాకు మంచి డీల్ ఇవ్వడంతో నిర్మాత జ్ఞానవేల్ ఏమాత్రం మాట్లాడకుండ ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ వారికి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ( Devi Sri Prasad ) సంగీతం అందించగా సూర్య సరసన దిశా పటాని( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తున్నారు.