కంగువ తెలుగు రాష్ట్రాల లెక్కలు చూస్తే షాకవ్వాల్సిందే.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తమిళ హీరో సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం కంగువ(kanguva).ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది.

హీరో సూర్య (suriya) సినిమాలో విభిన్న పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఈ సినిమా టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో రూపొందినట్లు ప్రచారం జరిగింది.రెండు విభిన్న కాలాల మధ్య జరిగే కథ, ఆ రెండు కాలాల్లో ఉండే రెండు పాత్రలను కనెక్ట్‌ చేసే విధానాన్ని కంగువలో దర్శకుడు శివ చాలా అద్భుతంగా చూపించారు అంటూ తమిళ మీడియాతో పాటు జాతీయ స్థాయి వెబ్‌ మీడియాలోనూ కథనాలు వినిపించాయి.

Suriya Kanguva Movie Telugu Version Business Collection, Suriya, Kanguva Movie,
Advertisement
Suriya Kanguva Movie Telugu Version Business Collection, Suriya, Kanguva Movie,

దాంతో కథ విషయంలో మరింత చర్చ మొదలైంది.సూర్య గతంలో నటించిన 24 సినిమా కథతో ఈ సినిమాకు కనెక్షన్‌ ఉందని కొందరు అంటున్నారు.సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా చర్చ మాత్రం పతాక స్థాయిలో వస్తుంది.

అందుకే సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సైతం అదే మాదిరిగా పెరిగింది.ఇకపోతే తమిళనాట కంగువ సాధించబోతున్న వసూళ్లు కచ్చితంగా సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయం అని, అలాగే ఇప్పటి వరకు ఉన్న సూపర్‌ స్టార్‌ రికార్డ్‌ లు అన్నీ బ్రేక్‌ అవ్వడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కంగువ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ తో కలిసి నిర్మించిన విషయం తెలిసిందే.

Suriya Kanguva Movie Telugu Version Business Collection, Suriya, Kanguva Movie,

తెలుగు నిర్మాణ సంస్థ అవ్వడంతో పాటు, దర్శకుడు శివ(Director Shiva) తెలుగులో పలు సినిమాలను చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు.అందుకే కంగువ సినిమాను తెలుగు బయ్యర్లు భారీ మొత్తాలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.విశ్వసనీయంగా అందుతున్న మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కంగువ సినిమా దాదాపుగా రూ.50 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.55 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంది.కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ఏరియాల్లోనూ కంగువ సినిమా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ (Pre-release business)ను దక్కించుకుందట.ఓవర్సీస్‌ లో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.45 కోట్లకు కొనుగోలు చేసిందట.అన్ని భాషల వర్షన్‌లు కలిపి రూ.50 కోట్లు వసూళ్లు సాధించడం ఖాయం అని ప్రాధమిక అంచనాకి వచ్చినట్లు తెలుస్తోంది.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు