డైరక్టర్ కి సురేష్ బాబు క్లాస్..!

రెజినా, నివేదా థామస్ కలిసి చేసిన లేటెస్ట్ మూవీ శాకిని డాకిని.శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.

ఈ సినిమా నిర్మాత సునీత కూడా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.అయితే సినిమాని డైరెక్ట్ చేసిన సుధీర్ వర్మ మాత్రం కంటికి కనిపించడం లేదు.

సుధీర్ వర్మకి నిర్మాతలకి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని మీడియా టాక్.అయితే సుధీర్ వర్మ గురించి మేకర్స్ మాత్రం తను వేరే సినిమాలో బిజీగా ఉండటం వల్లే ప్రమోషన్స్ కి రాలేకపోతున్నాడని చెబుతున్నారు.

రవితేజ తో సుధీర్ వర్మ చేస్తున్న సినిమా పెద్ద సినిమా అని ఆ సినిమాకు ఇబ్బంది కాకూడదని సుధీర్ వర్మ శాకిని ఢాకిని ప్రమోషన్స్ కి రావట్లేదని అంటున్నారు.అయితే ఈ క్రమంలో సుధీర్ వర్మ కి నిర్మాత సురేష్ బాబు క్లాస్ పీకినట్టు తెలుస్తుంది.15 నుంచి సుధీర్ వర్మ కూడా శాకిని డాకిని ప్రమోషన్స్ లో పాల్గొంటారని టాక్.మరి ఈ టైం లో ఆయన వచ్చి చేసేది ఏమి లేకపోయినా దర్శకుడు కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే అదో కిక్ అని అనుకోవచ్చు.

Advertisement
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

తాజా వార్తలు