సురేఖ వాణి కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది అప్పుడే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న నటి సురేఖ వాణి.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించింది.

కానీ ఆమె తన పరిచయాన్ని ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా పెంచుకుంది.నిత్యం ఫోటోలతో, డాన్స్ వీడియోలతో బాగా హల్ చల్ చేస్తుంది.

ఇక ఈమెతో పాటు తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.వీళ్లిద్దరు తమ డాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.

ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి సుప్రీత ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది సురేఖవాణి.ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరిచయంలేని సుప్రీత సోషల్ మీడియాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

Advertisement

తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను కన్నార్పకుండా చేస్తుంది.పైగా ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది సుప్రీత.

ఇక తనకు నెగటివ్ కామెంట్స్ వస్తే మాత్రం వాళ్లను తన మాటలతో తొక్కి పారేస్తుంది.అంతేకాకుండా గతంలో తనకు ఎదురైన ప్రశ్నలకు ఓ రేంజ్ లో మండిపడింది సుప్రీత.

ఇక తాజాగా సురేఖవాణి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని విషయాలను పంచుకుంది.పైగా తన కూతురు సుప్రీత గురించి కూడా కొన్ని విషయాలు తెలిపింది.టాలీవుడ్ హీరోయిన్ గా సుప్రీత ఎంట్రీ ఎప్పుడని ప్రశ్న ఎదురవడంతో.

ప్రస్తుతం తను స్టడీ లో బిజీగా ఉందని అంతేకాకుండా నటన పట్ల ట్రైనింగ్ కూడా తీసుకుంటుందని తెలిపింది సురేఖవాణి.ఇక డైలాగ్ కోసం స్పష్టంగా మాట్లాడటానికి ఓ గురువు తనకు హెల్ప్ చేస్తున్నారని తెలిపింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

కానీ తాను ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకోలేదని.ఒకవేళ తన ఎంట్రీ ఉంటే తప్పకుండా చెబుతానని తెలిపింది సురేఖవాణి.

Advertisement

ఇక దీనిని బట్టి సుప్రీత కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది.ఇదిలా ఉంటే సురేఖవాణి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు