Surekhavani : నాకు సొంతిల్లు లేదు.. నా ప్రాపర్టీ ఆమ్మేశాను.. సురేఖావాణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

శ్రీనువైట్ల సినిమాల ద్వారా పాపులర్ అయిన సురేఖావాణి( Surekha Vani ) కామెడీ టైమింగ్ కు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఆమె పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా తరచూ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్స్ చేశారని సురేఖావాణి తెలిపారు.

నాకు 19 సంవత్సరాలకే డైరెక్టర్ సురేష్ తేజ( Director Suresh Teja )తో పెళ్లైందని అప్పుడు పెద్దదానిలా మారిపోయానని ఇప్పుడు నా వయస్సు 42 సంవత్సరాలు అని ఆమె తెలిపారు.

నేను 20 సంవత్సరాల పిల్లలా ఇప్పుడు నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నానని సురేఖావాణి పేర్కొన్నారు.నా భర్త ఉన్నా నేను ఇలానే ఉండేదాన్నని మొదట ఈ కామెంట్లు చూసి భరించలేకపోయానని ఆ తర్వాత వీళ్లు మారరని వదిలేశానని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

ప్రతివాడి నోరు మూయించలేమని నా గురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.సింగిల్ పేరెంట్ కాబట్టి విమర్శలు, ఎత్తిపొడుపులు ఉంటాయని సురేఖావాణి తెలిపారు.నా భర్త ఆస్పత్రి పాలైన సమయంలో ఎంత బాగా చూసుకున్నానో ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసని ఆమె తెలిపారు.

మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్లు అడిగారని నాకు రెండో పెళ్లి ఇష్టం లేదని ఆమె పేర్కొన్నారు.ఇప్పటివరకు నాకు సొంతిల్లు లేదని ఈ మధ్య నా ప్రాపర్టీ కూడా అమ్మేశానని సురేఖావాణి చెప్పుకొచ్చారు.

కొన్ని వార్తల వల్ల ముద్ద దిగక ఏడుస్తూ కూర్చుండిపోయానని ఆమె తెలిపారు.ప్రశాంతమైన లైఫ్ ప్రసాదించాలని కోరుకుంటూ తిరుమల( Tirumala ) శ్రీవారికి తలనీలాలు సమర్పించానని ఆమె తెలిపారు.

సురేఖావాణి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు