కూతురు సినీరంగ ప్రవేశంపై సురేఖ వాణి కీలక నిర్ణయం

సీనియర్ నటి ఎన్నో సినిమాల్లో హీరోలకు హీరోయిన్స్ కు తల్లిగా నటించి మెప్పించిన సురేఖ వాణి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటున్నారు.ఆమె భర్త చనిపోయిన సమయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా వాటికి సమాధానం చెప్పిన సురేఖ కూతురు సుప్రిత తో జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.

కూతురు తో సురేఖ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.40 ఏళ్ల సురేఖ వాణి తన 20 ఏళ్ల కూతురుతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.ఇద్దరు కూడా సోషల్‌ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.

చిన్న పిల్లల మాదిరిగా అల్లరి చేస్తూ హడావుడి చేస్తూ ఉంటారు.సురేఖ ఆమద్య కూతురు సినిమా రంగ ప్రవేశం కు సంబంధించిన వార్తలను ఖండించింది.

కాని ఆ తర్వాత తనకు ఇష్టం ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సురేఖ వాణి తన కూతురు సుప్రిత ను హీరోయిన్ గా పరిచయం చేయాలని భావిస్తుందట.

ఆమద్య కొన్ని వెబ్‌ సిరీస్ లతో పాటు చిన్నా చితకా సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కించుకుందట.కాని ఇప్పటి వరకు సుప్రిత ను ఏ సినిమా కు సైన్ చేయించలేదు.

Advertisement

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అన్ని కుదుట పడ్డ తర్వాత మాత్రమే సుప్రితను సినిమా ల్లో నటింపజేస్తానంటూ సురేఖ ఇటీవల ఒక చిట్ చాట్‌ సందర్బంగా చెప్పుకొచ్చిందట.అంటే సుప్రిత వెండి తెర ఎంట్రీకి కనీసం రెండేళ్ల సమయం అయినా పడుతుంది.

సుప్రిత సినిమా ద్వారానే కాకుండా వెబ్‌ సిరీస్ లో అయినా నటించేందుకు సిద్దంగా ఉందట.ఇక సుప్రిత డాన్స్ తో పాటు నటన కు కూడా శిక్షణ పొందినట్లుగా తెలుస్తోంది.

ఇదే సమయంలో సురేఖ వాణి కూడా వరుసగా సినిమా లను దక్కించుకుంటుంది.స్టార్‌ హీరోల తో సినిమా ల్లో కాకున్నా కొత్త హీరోల సినిమా ల్లో అయినా నటిస్తూ వస్తోంది.

తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఒకే సినిమా లో కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు