అయోధ్య కేసులో మధ్యవర్తిత్వంకి మొగ్గు చూపిన సుప్రీం కోర్ట్!

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం విషయంలో సుప్రీం కోర్ట్ లో హిందూ, ముస్లింల మధ్య దశాబ్దాలుగా వాదనలు నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇక సుప్రీం కోర్ట్ లో రామ మందిరం నిర్మించాలా లేక మసీదు నిర్మించాలా అనే విషయంలో సుప్రీం కోర్ట్ లో హిందూ మహాసభ తరుపున లాయర్, అలాగే ముస్లింల తరుపున లాయర్ లు తమ వాదనలు వినిపించారు.

అయితే దీనిలో ఎవరిని తీర్పు అనుకూలంగా చెప్పిన మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం వుంది.తరువాత శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం కూడా వుంది.

ఈ నేపధ్యంలో ఈ అయోధ్య కేసుని విచారించిన సుప్రీం కోర్ట్ రెండు వర్గాల మధ్య వాదనలు విన్న సుప్రీం కోర్ట్ ఇక రెండు వర్గాల వారు మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమె సమస్య పరిష్కరించుకోవాలి అని సూచించారు.అయితే దీనికి హిందూ మహాసభ తరుపున లాయర్ వ్యతిరేకించడంతో ధర్మాసనం వారికి వార్నింగ్ ఇచ్చి, మధ్యవర్తిత్వంతోనే సమస్య పరిష్కరించుకోవాలి అని, దీనికి మీడియాకి ప్రవేశం లేకుండా రహస్యంగా ఇరు వర్గాలు పరిష్కారం చేసుకోవాలని సూచించారు.

దీనికి ముస్లింల తరుపున నిరభ్యంతరం చెప్పడం విశేషం.

Advertisement
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

తాజా వార్తలు