మణిపూర్ హింసపై సుప్రీంకోర్టులో విచారణ

మణిపూర్ హింసాత్మక ఘటనలపై భారత అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఈ మేరకు మణిపూర్ అంశంపై సమగ్ర విచారణ చేసేందుకు ముగ్గురు మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు కానుంది.

జస్టిస్ గీతా మిట్టల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కానుండగా ఇందులో జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ షాలినీ జోషి, జస్టిస్ ఆశామీనన్ లు ఉంటారని తెలుస్తోంది.కాగా మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు పరిహారం, పునరావాసంపైనా కమిటీ అధ్యయనం చేయనుంది.

అదేవిధంగా సీబీఐ దర్యాప్తును ఐపీఎస్ అధికారి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.అల్లర్ల కేసుల విచారణ సజావుగా జరిగే విధంగా డిప్యూటీ ఎస్పీ ర్యాంకులో ఐదుగురు అధికారులను సీబీఐలోకి తీసుకోవాలని ధర్మాసనం కోరింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 
Advertisement

తాజా వార్తలు