మహేష్ తో పోటీ పడేందుకు సిద్ధమైన విజయ్ దేవరకొండ..!

సూపర్ స్టార్ మహేష్ పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022 ఏప్రిల్ 1న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ముందు 2022 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా పొంగల్ రేసులో చాలా సినిమాలు వస్తున్న సందర్భంగా సర్కారు వారి పాట సినిమాను వాయిదా వేసుకున్నారు.

అయితే ఏప్రిల్ 1న మహేష్ సినిమాతో విజయ్ దేవరకొండ లైగర్ పోటీ పడుతుందని తెలుస్తుంది.పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమా ఇప్పటికే చాలా రిలీజ్ డేట్లు అనుకున్నా వాయిదా పడ్డాయి.

Mahesh Sarkaru Vari Pata Vijay Devarakonda Liger Boxoffice Fight Details, Box Of

ఫైనల్ గా 2022 ఏప్రిల్ 1న సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.మహేష్ తో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ.

లైగర్ సినిమాలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.సినిమాలో అనన్యా పాండే స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని తెలుస్తుంది.

Advertisement

మరి సర్కారు వారి పాట వర్సెస్ లైగర్ రెండు సినిమాల్లో ఏది విజయ కేతనం ఎగురవేస్తుందో చూడాలి.  మహేష్ సర్కారు వారి పాట మీద ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి.

మరి మహేష్ తో విజయ్ సినిమా పోటీ ఎంతవరకు సేఫ్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు