కొత్త వ్యాపారం మొదలుపెడుతున్న సూపర్ స్టార్

స్టార్ హీరోగా, టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు తన మార్కెట్ ని విస్తరించుకొని కేవలం తెలుగు సినిమాలతోనే వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న హీరోగా మారిపోయాడు.

ఇతర స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీలతో ఇతర భాషల మీద కూడా దృష్టి పెడుతూ ఉంటే మహేష్ బాబు తెలుగు మార్కెట్ పైనే ఫోకస్ పెట్టాడు.

స్టార్ హీరోగా తనకున్న గుర్తింపుని కాష్ చేసుకుంటూ కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు.అలాగే తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించే పనిలో ఉన్నాడు.

ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్ మొదలెట్టి సినిమాలు నిర్మించడంతో పాటు నిర్మాణ బాగస్వామిగా ఉన్న మహేష్ బాబు హైదరాబాద్ లో ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టిఫ్లెక్స్ థియేటర్ ను స్థాపించిన సంగతి తెలిసిందే.కొన్ని రోజుల క్రిందట ది హంబుల్ కో పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ ప్రారంభించి వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

ఆన్లైన్ బిజినెస్ పోర్టల్ గా ఈ బ్రాండ్ కు మంచి ఆదరణ దక్కుతుంది.ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.

Advertisement

ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను స్థాపించే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నారని సమాచారం.

మంచు మనోజ్ కు షాకిచ్చేలా లేఖ రాసిన తల్లి.. ఈ హీరో ఒంటరివాడు అవుతున్నాడా?
Advertisement

తాజా వార్తలు