యువ దర్శకుల కథలపై మహేష్ బాబు ఆసక్తి

స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ తో టాలీవుడ్ లో రూల్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.

అతనికి చివరిగా నాలుగేళ్ల క్రితం స్పైడర్ సినిమాతో ఫ్లాప్ వచ్చింది.

ఆ తర్వాత మహేష్ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.అన్ని కూడా ఇండస్ట్రీలో కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసిన చిత్రాలే కావడం విశేషం.

మిగిలిన హీరోలు ఇతర బాషలలో ఎస్టాబ్లిష్ అయ్యి పాన్ ఇండియా స్టార్స్ అనిపించుకోవాలని అనుకుంటే మహేష్ బాబు మాత్రం కేవలం తెలుగు మీదనే ఫోకస్ పెట్టాడు.తెలుగు సినిమాల ద్వారానే ఇతర రాష్ట్రాలలో కూడా తన మార్కెట్ విస్తృతం చేసుకుంటున్నాడు.

టాలీవుడ్ లో 200 కోట్ల వరకు కేవలం తెలుగులోనే మార్కెట్ ఉన్న ఏకైక హీరోగా అంటే మహేష్ బాబు అని చెప్పాలి.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారిపాట సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.

Advertisement

ఇందులో మొదటి సారి క్లాస్ లుక్ లో కాకుండా పూర్తి మాస్ లుక్ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి దుబాయ్ లో స్టార్ట్ కాబోతుంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాల విషయంలో సీనియర్ దర్శకులని కొంత కాలం పక్కన పెట్టి యువ దర్శకులకి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.యువ దర్శకులు అయితే తనలోనే మరో యాంగిల్ లో ప్రెజెంట్ చేయడంతో పాటు కొత్త కథలతో వస్తారనే అభిప్రాయంతో కొత్త దర్శకులు కథలు వింటున్నాడని తెలుస్తుంది.చిన్న సినిమాలతో సక్సెస్ అందుకున్న యువ దర్శకులకి మహేష్ పీఆర్ టీం ఫోన్ చేసి కథలు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నట్లు బోగట్టా.

ఈ నేపధ్యంలో రీసెంట్ గా వెంకీ కుడుములు చెప్పిన కథ విని ఒకే చేసినట్లు తెలుస్తుంది.ఇక అదే పనిలో చిన్న సినిమాలతో సక్సెస్ లు అందుకుంటున్న శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ లాంటి దర్శకుల కథలు కూడా వింటున్నారని టాక్ వినిపిస్తుంది.

చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?
Advertisement

తాజా వార్తలు