సూపర్ మచ్చి సినిమా రివ్యూ: వన్ సైడ్ లవ్ తో అదరగొట్టిన కళ్యాణ్ దేవ్!

డైరెక్టర్ పులి వాసు దర్శకత్వంలో రూపొందిన సినిమా సూపర్ మచ్చి.ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్, రుచితా రామ్ నటీనటులుగా నటించారు.

 Super Machi Movie Review And Rating, Super Machi, Tollywood, Movie, Review, Rati-TeluguStop.com

అంతేకాకుండా రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, అజయ్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు.

ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించాడు.మంచి ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.ఇక సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఈ రోజు థియేటర్ లో విడుదలైంది.ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.

కథ: ఇందులో కళ్యాణ్ దేవ్ రాజు అనే పాత్రలో బరువు బాధ్యత లేని జల్సారాయుడు గా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.ఇక మీనాక్షి పాత్రలో రచితరామ్ నటించగా.ఇందులో మీనాక్షి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది.ఇక ఈమెకు రాజు అంటే చాలా ఇష్టం.కానీ అతడు ఆమెను ఇష్టపడడు.

ఆమె వెంట పడిన కూడా అతడు మాత్రం అస్సలు పట్టించుకోడు.అయినా కూడా ఆమె మాత్రం వెంట పడుతూనే ఉంటుంది.

ఇక ఆ గొడవ తట్టుకోలేక అతడు.ఓరోజు తనతో గడిపితే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.

అలా రాజుకు మీనాక్షి అంటే ఇష్టం ఉన్న కూడా.రాజు తనను ఎందుకు పట్టించుకోడు అనేది, రాజు కోసం తన పాత బాయ్ ఫ్రెండ్ ను ఎందుకు వదులుకుని అనేది, చివరికి వీరి ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

నటినటుల నటన: కళ్యాణ్ దేవ్ తన మాస్ పాత్ర తో బాగా అదరగొట్టాడు.ఇక రచితరామ్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది.

మిగతా నటీనటులంతా తమ పాత్రలతో బాగానే మెప్పించారు.

టెక్నికల్: డైరెక్టర్ ఈ కథను తెరపై రుచి చూపించేందుకు చాలావరకు ప్రయత్నించాడు.ఇక తమన్ మ్యూజిక్ ఎక్కువగా లేదు.సినిమాటోగ్రఫీ పరవాలేదు.ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాలను బాగానే చూపించారు.ఎడిటింగ్ లో కాస్త మిస్ అయినట్టు అనిపించింది.

Telugu Kalyan Dev, Review, Machi, Tollywood-Movie

విశ్లేషణ: ఇక ఈ సినిమా మంచి ప్రేమకథతో, ఎమోషనల్ సన్నివేశాలతో తెరకెక్కింది.చాలావరకు సరదా సరదాగా ఈ సినిమా నడుస్తుంది.ఇందులో మీనాక్షి రాజు పై ఉన్న ప్రేమ ఎటువంటిదో అద్భుతంగా చూపించాడు దర్శకుడు.ఈ సినిమా వన్ సైడ్ లవ్ ట్రాక్ నడుస్తుంది.ఇక ప్రేమ విషయంలో కూడా సస్పెన్స్ అనేది బాగా క్రియేట్ చేశాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్: సస్పెన్స్ ట్విస్ట్, సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఎమోషనల్స్, రొమాన్స్.

Telugu Kalyan Dev, Review, Machi, Tollywood-Movie

మైనస్ పాయింట్స్: ఇందులో తమన్ మ్యూజిక్ ఎక్కువగా కనిపించకపోవటం కాస్త నిరాశ అనిపించింది.ఎడిటింగ్ ను ఇంకా కాస్త చూపిస్తే బాగా ఉండేది.డైరెక్టర్ కూడా మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.

బాటమ్ లైన్: ఈ సినిమా మంచి ప్రేమ కథతో రూపొందగా ఈ పండగకి చూడవలసిన సినిమా అనే చెప్పవచ్చు.

రేటింగ్: 2.5/5

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube