ఈ రోజు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తో చెన్నై మ్యాచ్.. ఏ జట్టుకు ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి..

ఐపీఎల్ సీజన్ ఆరంభం లో వరుస విజయాలతో దూసుకుపోయిన జట్టు సన్ రైజర్స్ అయితే ఆడిన గత 3 మ్యాచ్ లలో వరుస ఓటములు చెంది పాయింట్ ల పట్టికలో వెనకంజ వేసింది.

ఆ జట్టు ఎక్కువగా ఓపెనర్లు వార్నర్ , బైర్ స్టో ల పైనే ఆధారపడి ఉంది.

హైదరాబాద్ గెలిచిన 3 మ్యాచ్ లలో కూడా వీరే కీలక పాత్ర పోషించారు.ఇకపోతే సన్ రైజర్స్ జట్టు మిడిల్ ఆర్డర్ పేలవ ఫామ్ లో ఉంది.

ఇటు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 8 మ్యాచ్ లలో 7 మ్యాచ్ లు గెలిచి పాయింట్ ల పట్టికలో అగ్రస్థానం లో ఉంది.ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ కి అన్ని జట్లకన్న ముందుగా స్థానం ఖరారు చేసుకోవాలని ఆశిస్తోంది.

1)ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ లు ఎలా ఉన్నాయి

ఇప్పటి వరకు చెన్నై కి సన్ రైజర్స్ కి జరిగిన 10 మ్యాచ్ లలో చెన్నై జట్టు 8 మ్యాచ్ లలో గెలవగా సుంర్ రైజర్స్ జట్టు కేవలం 2 మ్యాచ్ లలో విజయం సాధించింది.

2)పిచ్ ఎలా ఉండబోతుంది

ఈ మ్యాచ్ హైదరాబాద్ లో జరగనుంది.ఇక్కడ సన్ రైజర్స్ కి మంచి రికార్డ్ ఉంది.పిచ్ నెమ్మదిగా ఉండనుంది.

Advertisement

టాస్ గెలిచే జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ పిచ్ పైన 160 పైగా పరుగులు చేస్తే లక్ష్య చేదన చేసే జట్టుకు బ్యాటింగ్ లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి.

3)సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలా ఉండబోతుంది

ఐపీఎల్ సీజన్ ఆరంభం లో సన్ రైజర్స్ జట్టు ఆట తీరుని చూసి ఈ సీజన్ లో ఆ జట్టుకు తీరుగుండదు అని అందరూ భావించారు , కానీ హైదరాబాద్ జట్టు వరుస గా 3 మ్యాచ్ లలో ఓడి ఒత్తిడి లో ఉన్నారు.ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాల్సిన పరిస్థితి.ఇకపోతే బ్యాటింగ్ లో ఓపెనర్లని మినహాయిస్తే ఏ ఒక్కరు పిచ్ పైన నిలవలేకపోతున్నారు.

విజయ్ శంకర్ అడపాదడపా ఇన్నింగ్స్ లు ఆడిన అవి జట్టు విజయానికి పెద్దగా లాభించడం లేదు.బౌలింగ్ లో రషీద్ ఖాన్ , భువనేశ్వర్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న లక్ష్య చేదన లో జట్టు విఫలమవుతుంది.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( PROBABLE XI ) - డేవిడ్ వార్నర్ , జానీ బైర్ స్టో , కేన్ విల్లియమ్సన్ , విజయ్ శంకర్ , యూసుఫ్ పఠాన్ , దీపక్ హూడా , అభిషేక్ శర్మ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సిద్దార్థ్ కౌల్ , ఖలీల్

4)చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలా ఉండబోతుంది

గత సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా చెన్నై దుమ్మురేపుతోంది.ఒక ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ని మినహాయిస్తే ఈ సీజన్ లో ఆడిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధించి మంచి జోరు మీద ఉంది చెన్నై జట్టు.ఆ జట్టు బౌలర్లు జడేజా , చహార్ , మిచెల్ సంట్నర్ , తహిర్ లతో బలంగా ఉంది.

ఇకపోతే బ్యాటింగ్ లో రైనా, ధోని లతో పాటు డూప్లెసిస్ ఫామ్ ఆ జట్టు బ్యాటింగ్ కూడా పటిష్టంగా ఉంది.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( PROBABLE XI ) - ఫాఫ్ డూప్లెసిస్ ,షేన్ వాట్సన్ ,సురేష్ రైనా , ధోని ,కేదార్ జాధవ్ , రవీంద్ర జడేజా ,అంబటి రాయుడు , సంట్నర్ , చహార్ , ఇమ్రాన్ తహిర్ , శార్దూల్ ఠాకూర్ .

మనుషులా? పిశాచాలా?..టీడీపీపై సజ్జల సీరియస్..!!
Advertisement

తాజా వార్తలు