తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది.మరో నాలుగు వారాలు మిగిలి ఉన్న ఈ సీజన్ లో ప్రస్తుతం అందరు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కనిపిస్తున్నారు.
ఒక్కరు ఇద్దరు తప్ప అందరు కూడా ఫైనల్ 5 కి అర్హులే అన్నట్లుగా అందరికి మద్దతు ఉంది.అయితే ఇద్దరికి మాత్రం మద్దతు పెద్ద ఎత్తున వ్యక్తం అవుతోంది.
బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో కూడా కొందరు అనూహ్యంగా బలం పుంజుకోవడం మనం చూస్తూనే ఉంటాం.అలాంటి వారు బిగ్ బాస్ లో ఈసారి సన్నీ అనడంలో సందేహం లేదు.
ముందు వరకు అతడి గురించి పెద్దగా ఎవరికి తెలియదు.కాని అతడి ఆవేశం మరియు ఆలోచన ఇంకా అతడి ఎంటర్ టైన్ మెంట్ కారనంగా బిగ్ బాస్ లో ఆయన మోస్ట్ పవర్ ఫుల్ గా మారాడు.
సాదారణంగా అయితే షన్నూ తో అతడికి పెద్దగా గొడవ లేదు.కాని ఈసారి మాత్రం అతడికి షన్నూకు జరిగిన గొడవ కాస్త శృతి మించింది.
అది కాస్త ఈ సీజన్ లోనే హైలైట్ అన్నట్లుగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

ఆ గొడవ లో తప్పు మొత్తం సన్నీ దే అన్నట్లుగా షన్నూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలు పెట్టారు.యూట్యూబ్ లో నాలుగు మిలియన్ ల మంది ఫాలోవర్స్ ను షన్నూ కలిగి ఉన్న విషయం తెల్సిందే.వారంతా కూడా ఖచ్చితంగా షన్నూ కు మద్దతుగా నిలుస్తున్నారు.
దాంతో షన్నూ ను సపోర్ట్ చేస్తూ వారు ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు.షన్నూ పేరుతో ట్విట్టర్ లో జరిగిన ట్రెండ్ ఇండియా వైడ్ గా దుమ్ము రేపింది.
బిగ్ బాస్ సీజన్ 5 లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ సన్నీ అంటూ నిరూపించేందుకు గాను ప్రయత్నాలు జరిగాయి.అందులో భాగంగానే షన్నూ ట్రెండ్ కు ఏమాత్రం తగ్గకుండా సన్నీ పేరు కూడా ట్రెండ్ అయ్యాడు.
ట్విట్టర్ లో ఇండియా వైడ్ గా సన్నీ పేరును ట్రెండ్ చేశారు.ఇది ఖచ్చితంగా అతడి విజయంలో కీలకం అవ్వబోతుంది అంటున్నారు.
ఎందుకంటే బిగ్ బాస్ లో ఇలా మద్యలో క్రేజ్ తెచ్చుకున్న వారికే మంచి గుర్తింపు వచ్చింది ట్రోఫీ కూడా వచ్చింది.