సన్ని లియోన్ అంటే గిట్టని వారు చేస్తున్న పని అది

బాలివుడ్ హాట్ భామ సన్ని లియోన్ మీద రాసే రూమర్లకు లెక్క లేకుండా పోతోంది.సన్ని ఓ చోట కనబడితే కొత్త రూమర్ పుడుతోంది.

ఏదైనా షోకి వెళ్ళినా రూమర్ పుడుతోంది.ఓసారి సన్ని లియోన్ విలేఖరిపై చేయి చేసుకుంది అంటారు.

ఇంకోసారి సన్ని డైరెక్టర్ల మాట వినట్లేదు అంటారు.మరోసారి సన్ని ఇకనుంచి ముద్దు సన్నివేశాలు చేయదు అని అంటారు.

పాపం సన్ని, ఇన్నిరకాలుగా తన గురించి మాట్లాడుకుంటున్నా కామ్ గా అన్నీ ఖండిస్తూనే వస్తోంది తప్పా, కొంచెం కూడా మాట జారట్లేదు." నాకు తెలుసు, నేను ఇంటర్నెట్ లో అత్యధిక మంది వెతికే సెలబ్రటిని అని.జనాలు వార్తలను చదవాలని నా మీద ఇష్టమొచ్చినట్లు రాస్తారు.నేను ఎలా పనిచేస్తాను అనేది నా దర్శకులకు తెలుసు.

నా ప్రవర్తన కాని, పనితీరు కాని సరిగా లేకపోయింటే, ఈరోజు ఇలా బాలివుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో ఒక భాగమయ్యేదాన్ని కాదు.గిట్టని వారు నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తే నా పని మానుకోని వారి గురించి అలోచించే రకం కాదు నేను " అంటూ మళ్ళీ కామ్ గా తన స్టైల్లో చెప్పింది సన్ని.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు