ప్రస్తుతం సమ్మర్ సీజన్( Summer season ) నడుస్తుండటంతో.ప్రపంచవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి.
భారత్ తో పాటు చాలా దేశాల్లో భానడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.దాదాపు 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండలతో పాటు వడగాల్పుల ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై అనారోగ్యానికి గురవుతున్నారు కొంతమంది వ్యక్తులు.
భానుడి భగభగలతో అల్లాడిపోతున్నారు.
అయితే ఇలాంటి ఎండల్లో తిరగాలంటే కష్టమే.
నిమిషాల్లోనే అలసిపోయి డీహైడ్రేషన్‌కు( dehydration ) గురవుతూ ఉంటాం.ఇలాంటి సమయంలో ఎండలో పరేడ్ చేసిన సైనికులకు కష్టంగా ఉంటుంది.
ముగ్గురు బ్రిటిష్ సైనికులు తాజాగా ఎండలలో పరేడ్ చేస్తూ కుప్పకూలిపోయారు.ఈ ఘటన బ్రిటన్‌లోని ప్రిన్స్ విలియమ్( William of Britain ) ముందు కలర్ పరేడ్ కార్యక్రమంలో జరింది.
పరేడ్ చేస్తుండగా ఎండ వేడికి తట్టుకోలేక ముగ్గురు సైనికులు కింద పడిపోయారు.నిల్చున్న చోటే కుప్పకూలిపోయారు.
ఎండలో యూనిఫామ్స్, హ్యాట్లు ధరించడం ఇబ్బందిగా మారింది.

సైనికులు పడిపోయినా పరేడ్ అలాగే కొనసాగింది.కుప్పకూలిన సైనికులను స్ట్రెచర్‌లో తీసుకెళ్లారు.దీనిపై పరేడ్ ప్రిన్స్ విలియమ్ స్పందించాడు.
కష్ట పరిస్థితుల్లో కూడా పరేడ్ విజయవంతంగా చేశారని కితాబిచ్చారు.పరేడ్ చేసిన సైనికులపై ప్రశంసలు కురిపించారు.
పరేడ్ లో పాల్గొన్న ప్రతిఒక్క సైనికుడికి ధన్యవాదాలు అంటూ తెలిపారు.కష్టమైన పరిస్థితుల్లో అద్భుతంగా పరేడ్ చేశారని, ఇంత హార్డ్ వర్క్ చేసి రిహార్సల్స్ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ప్రతిఒక్కరికీ ఈ క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కింద పడిపోయిన సైనికులను మిగతా సైనికులు ఆస్పత్రికి తరలించారు.అయితే ప్రస్తుతం ఆ దేశంలో 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది.వేడి గాలులు కారణంగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అలర్ట్ ప్రకటించింది.
రానున్న కొద్దిరోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.