సమ్మర్ ఎఫెక్ట్: ఆ దేశంలో నీలి రంగు రహదార్లు..!

ప్రపంచంలో మనం ఎక్కడైనా ఏ దేశంలో అయినా సరే రోడ్స్ అంటే ఎలా ఉంటాయి చెప్పండి.

ఎక్కడైనా సరే నలుపురంగు దానిపై తెల్ల గీతలు ఉండడం మనం సహజంగా చూస్తూ ఉంటాం.

అయితే ఎప్పుడైనా నీలి రంగులో ఉన్న రహదారిని చూశారా ?! లేదు కదా అయితే ఇది మీ కోసమే.ఖతార్ లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎడారి ప్రాంతం కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత కచ్చితంగా 50 డిగ్రీల పైనే ఉండటం జరుగుతూ ఉంటుంది.దీంతో వారు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.ఒకవేళ ఎవరైనా చెప్పుల్లేకుండా రోడ్లమీద ఎందుకు వచ్చారో కేవలం సెకండ్ల వ్యవధిలోనే వారి కాలికి బొబ్బలు వచ్చేస్తాయి.

దీనికి కారణం నల్లరంగు అధికంగా వేడిని గ్రహిస్తుంది.అందుకే వేసవికాలంలో నల్లని రోడ్ల వల్ల వాహనాలు కూడా ఎక్కువగా దెబ్బతింటున్నాయి.

Advertisement

దీనికోసమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం గా ఓ ప్రత్యేక పదార్థం తో తయారుచేసిన నీలిరంగు రోడ్లను తాజాగా ఆ దేశం ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరీక్షించింది.ముందుగా ఈ రోడ్లను కతార్ రాజధాని దోహాలో పైలెట్ ప్రాజెక్టుగా ఆ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ నీలిరంగు రోడ్లు నల్లని రోడ్ల తో పోలిస్తే తక్కువ సూర్యకాంతిని పీల్చుకుంటున్నాయి.అంతేకాదు ఎక్కువ అ కాంతిని పరావర్తనం చెందిచడంతో ఆ రోడ్లు ఎక్కువగా వేడి ఎక్కట్లేదు.దీంతో నీలిరంగు కారణంగా రోడ్డుపై ఉన్న ఉష్ణోగ్రత 10 నుంచి 20 డిగ్రీల వరకు తగ్గుదల కనిపిస్తోంది.

ఈ ప్రభావం చుట్టూ పక్కల ప్రాంతాలపై కూడా కనబడుతుంది.ఇలా కొన్ని రోజులు పరీక్షించిన తర్వాత నల్ల రోడ్ల బదులు నీలి రోడ్లు మంచి ఫలితాలు ఇస్తే కత్తార్ దేశం మొత్తం ఈ రోడ్లను విస్తరించే పనిలో ఉంది ఆ దేశ ప్రభుత్వం.

చూడాలి మరి ఈ నీలి రహదారులు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు