కారణం ఏంటో కానీ ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ క్యాష్( Suma Cash ) కార్యక్రమాన్ని ఆపేశారు.సుదీర్ఘ కాలంగా ఆ కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
భారీ రేటింగ్ సొంతం చేసుకున్న ఆ కార్యక్రమం ఆపేయడం పట్ల కొందరు సుమ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.క్యాష్ కార్యక్రమం ఆపేసిన వెంటనే సుమ అడ్డ అనే టాక్ షోని మొదలు పెట్టారు.
పలువురు ప్రముఖులు ఇప్పటికే ఆ టాక్ షో లో పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా సుమ అడ్డ ( suma adda )కార్యక్రమంలో పాల్గొనడంతో కార్యక్రమానికి మంచి బజ్ క్రియేట్ అయింది.క్యాష్ కార్యక్రమంతో పోలిస్తే మరింత సక్సెస్ ఈ షో దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ మొదట్లో చేసిన విధంగా కాకుండా సుమ క్యాష్ కార్యక్రమాన్ని ఎలా అయితే చేసేవారో అలాగే సుమ అడ్డ కార్యక్రమాన్ని చేస్తున్నారు.
టాక్ షో అంటూ మొదలు పెట్టిన నిర్వాహకులు ఒక గేమ్ షో మాదిరిగా సుమ అడ్డా ని నిర్వహిస్తున్నారు.పైగా అన్ని ఎపిసోడ్స్ కూడా సినిమా ప్రమోషన్ కోసమే అన్నట్లు నిర్వాహకులు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.

ఇది ఎంత మాత్రం సుమ అభిమానులకు నచ్చడం లేదు.ఇలాంటి పెయిడ్ కార్యక్రమాలు అవసరమా అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సుమ అంటే ఇప్పటికి కూడా ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయం ఉంది.ఆమె యాంకర్ గా చేసే కార్యక్రమాలకు మంచి స్కోప్ ఉంటుంది.అలాంటి సుమ టాక్ షో చేస్తుంది అనుకుంటే దాన్ని కాస్త ఇలా గేమ్ షో గా మార్చడం ఏ మాత్రం బాగాలేదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో సుమ అడ్డ గురించి రకరకాలుగా ట్రోల్స్ వస్తున్నాయి.
ముందుగా ఆమె అనుకున్న ప్రకారం సుమ అడ్డాని ఒక టాక్ షో మాదిరిగా నిర్వహించాలని అప్పుడే మళ్ళీ మంచి రేటింగ్ వస్తుంది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.టాక్ షో అయితే ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు పడడం లేదని.
అందుకే ఇలా గేమ్ షో మాదిరిగా ప్లాన్ చేశారని సమాచారం అందుతుంది.సుమ అస్సలు గేమ్ షో విషయంలో సంతృప్తిగా లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.







