తెలంగాణ కాంగ్రెస్( Congress ) లో తనను వ్యతిరేకిస్తున్న వర్గాన్ని తిరిగి తన దారికి తెచ్చుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పేరు చెబితే గ్రూపు రాజకీయాలు గుర్తుకు వస్తాయి.
ఎప్పుడూ ఏదో ఒక లీడర్ అసంతృప్తికి గురవుతూ, సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ, అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ప్రస్తావిస్తూ, తాము ఎవరిని లెక్క చేయమనే విధంగా వ్యవహరిస్తుండడం వంటివి చోటుచేసుకుంటూనే ఉంటాయి.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన దగ్గర నుంచి ఆయన నాయకత్వాన్ని లెక్కచేయునట్టుగా వ్యవహరించడం వంటి ఎన్నో సంఘటనలు తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటూనే వస్తున్నాయి.
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు ( general elections )సమయం కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, పార్టీలోని అసంతృప్త నాయకులను, తనను వ్యతిరేకిస్తున్న వర్గాన్ని దారిలో పెట్టే ప్రయత్నాలు రేవంత్ మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే సెంటిమెంటును జోడించి మరీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారంతా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని, పార్టీ కోసం, రాష్ట్రం కోసం అవసరమైతే తానే ఓ మెట్టు కిందకు దిగుతానని రేవంత్ వ్యాఖ్యానించారు.కెసిఆర్( KCR ) కు వ్యతిరేకంగా అందరం ఏకమవుదాం, తెలంగాణ అభ్యున్నతి కోసం కలిసి పని చేద్దాం.పార్టీని వీడి వెళ్లిన వారంతా తిరిగి రావాలి.కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిది.అందరూ ఆదరించాలి.నా నాయకత్వంలో కాదు, నేనే ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్నాను.
నావల్ల ఇబ్బంది అనిపిస్తే సీనియర్ నేతలతో మాట్లాడుకోవచ్చు.అవసరమనుకుంటే నేనే ఓ మెట్టు దిగుతా అంటూ రేవంత్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల( Karnataka Elections ) ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, మోదీ చరిష్మా అయిపోయిందని, కర్ణాటక ప్రజలు మోదీ పాలనను తిరస్కరించారని, ఆ పార్టీ కుట్రలను అర్థం చేసుకున్నారని రేవంత్ అన్నారు.తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ను కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే, కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేదని రేవంత్ విమర్శించారు.ఈటెల రాజేందర్, వివేక్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు కేసీఆర్ ను ఓడించేందుకు బిజెపిలోకి వెళ్లారని, బిజెపి వారిని నమ్మదు, వారు బిజెపిని నమ్మరు అని రేవంత్ అన్నారు.కెసిఆర్ వ్యతిరేక పునరేకికరణ జరగాలి, ఇందుకోసం అందర్నీ కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాను.
కేసీఆర్ ను ఓడించడం బిజెపితో కాదు.బిజెపి కేసిఆర్ వేరువేరు కాదు.
తెలంగాణ అభ్యున్నతికి పనిచేయాలనుకునేవారు కాంగ్రెస్ తో కలిసి రండి అంటూ రేవంత్ పిలుపునిచ్చారు.







