లవ్ యూ రాజీవ్ అంటూ భర్తకు స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సుమ?

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సుమ కనకాల ( Suma Kanakala ) ఒకరు ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

సుమ నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ) ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.ఇకపోతే తాజాగా రాజీవ్ కనకాల పుట్టినరోజు కావడంతో సుమ తనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు./br>

తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తన భర్తపై తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా తన భర్త గురించి రాసుకోస్తూ.నా ప్రియమైన భర్తకు పుట్టినరోజు( Birthday )శుభాకాంక్షలు మీరు లేకుండా నేను నా వృత్తిలో కొనసాగడం ఎంతో కష్టం.కెరియర్ పరంగా మీరు ఎప్పుడూ నాకు ఎంతో మద్దతుగా ఉంటూ నన్ను ప్రోత్సహించారు.

లవ్ యు రాజీవ్ అంటూ లవ్ సింబల్ తో ఈమె తన భర్త పై ఉన్నటువంటి ప్రేమను ఇలా తెలియజేశారు./br>

Advertisement

ఇక రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా సుమ ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఆ తన చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను జరిపించారు.ఇక సుమ తన భర్త పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి సుమ అభిమానులు తన భర్తకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సుమ కుమారుడు రోషన్ ( Roshan )గురించి అందరికీ సుపరిచితమే ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

బబుల్ గమ్( Bubble Gam )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు