24 ఏళ్ల వివాహ బంధం.. నువ్వక్కడ నేనిక్కడ అంటూ పెళ్లిరోజు జరుపుకున్న సుమ, రాజీవ్!

యాంకర్ సుమ రాజీవ్ కనకాల బంధం గురించి మనకు తెలిసిందే.వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు.

అయితే వీరి బంధం గురించి బయట ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.సుమ రాజీవ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారంటూ ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి.

అయితే ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈ జంట కొట్టి పారేశారు.ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ దంపతులు వివాహ బంధంలోకి అడుగుపెట్టి 24 ఏళ్లు అవుతోంది.

ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ 24వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.అయితే ఈ వివాహ వార్షికోత్సవానికి వీరిద్దరూ ఒకే చోట లేకపోవడంతో ఇద్దరు కలిసి వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెరైటీగా తమ పెళ్ళి రోజును జరుపుకున్నారు.వీడియో కాల్ ద్వారా వీరిద్దరూ కలిసి ఒక పాట రూపంలో తమ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు.

Advertisement

నువ్వక్కడ.నేనిక్కడ.

పాటిక్కడ.పలుకక్కడ అంటూ సుమ పాడితే.

మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా అంటూ రాజీవ్ కనకాల పాడేశాడు.ఇలా ఇద్దరు తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని బయటపెట్టారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని సుమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక సుమ ప్రస్తుతం వరుస సినిమా వేడుకలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక రాజీవ్ కనకాల సైతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

ఇక 24వ వివాహ వార్షికోత్సవం అని తెలియగానే ఎంతోమంది అభిమానులు యాంకర్ సుమ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు