పుష్ప యూనిట్ సభ్యులకు సుకుమార్ భారీ కానుక..!

పుష్ప సక్సెస్ జోష్ లో ఉన్న చిత్రయూనిట్ మంగళవారం చిత్రయూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పే ఈవెంట్ నిర్వహించింది.

థ్యాంక్స్ మీట్ లో భాగంగా సుకుమార్ ఎమోషనల్ గా మాట్లాడారు.

అందరు తమ పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తారని.కాని తన పని ఎప్పుడూ ఎంజాయ్ చేసేలా ఉండదని.

సినిమా చేస్తున్న టైం చాలా కష్టంగా సాగుతుందని.హిట్టు కొడితేనే తనకు సంతోషమని అన్నారు సుకుమార్.

సినిమా విషయంలో తన భార్య ఇచ్చిన సపోర్ట్ కూడా చాలా గొప్పదని అన్నారు.ఇక అల్లు అర్జున్ తన లైఫ్ కాపాడిన దేవుడు అని.ప్రతిసారి చెప్పి బోర్ కొట్టించినా తనని నీళ్లలోంచి కాపాడిన వ్యక్తి తనని.ఆ టైం లోనే బన్నీ నా దేవుడని ఫిక్స్ అయ్యానని అన్నారు సుకుమార్.

Advertisement

ఇక బన్నీ పైకి అలా జోవియల్ గా కనిపించినా లోపల మంచి ఫిలాసఫర్ ఉన్నాడని.పుష్ప సినిమా మొదట కేవలం తెలుగు వరకే చేద్దామని అనుకున్నా నిర్మాతలు, బన్నీ ప్రోత్సాహంతో పాన్ ఇండియా రిలీజ్ అయ్యిందని అన్నారు.

సినిమా హిందీలో మొదటి రోజుకి కలక్షన్స్ తో సమానంగా 11వ రోజు వసూళ్లు ఉన్నాయని.ఈ సినిమా యూనిట్ లో కష్టపడిన వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు సుకుమార్.

ఇక ప్రొడక్షన్ బోయ్స్, లైట్ బోయ్స్ తో పాటుగా ప్రాపర్టీ బోయ్స్ ఇలా యూనిట్ లో పనిచేసిన వారందరికి లక్ష రూపాయల చొప్పున ఇస్తానని చెప్పారు సుకుమార్.ఓ విధంగా సుకుమార్ పుష్పని చాలా ప్రెస్టిజియస్ గా తీసుకున్నాడని అర్ధమవుతుంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు