వరుణ్ సందేశ్( Varun Sandesh ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరటంలా దూసుకు వచ్చి ఉవ్వెత్తున ఎగిసిపడి అంతే త్వరగా వెనక్కి వెళ్ళిపోయాడు.2007లో హ్యాపీడేస్ వంటి చిత్రంతో వెండితెరపై తొలిసారి ప్రత్యక్షమై ఆ తర్వాత కొత్త బంగారు లోకం వంటి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకొని ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో వచ్చాడు అని అనుకునెలా చేశాడు.అయితే అందరికీ టైం ఒకలా ఉండదు కదా.మొదటి రెండు సినిమాలు అయితే విజయవంతం అయ్యాయి కానీ ఆ తర్వాత వరుస పెట్టి పరాజయాలు చవి చూడాల్సి వచ్చింది.కథలో ఎంపికలో పొరపాట్ల కారణంగా అతని కెరియర్ వెనక్కి వెళ్ళిపోయింది.</br

ఇప్పుడు బిగ్బాస్ తో కొంచెం క్రేజ్ సంపాదించుకొని మళ్ళీ బిజీ అయ్యే పనిలో పడ్డాడు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవడం లేదు.2023వ సంవత్సరంలో మైకెల్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అంటూ రెండు సినిమాలతో వెండితెరపై సందడి చేసిన అతనికి రావాల్సినంత పేరు, గుర్తింపు అయితే రాలేదు.ఇక చిత్రము చూడరా అనే సినిమాని అనౌన్స్ చేశారు కానీ అది పట్టాలెక్కడం లేదు.
అలాగే యద్భావం తద్భవతి( Yadbhaavam Tadbhavati ) అనే మరో సినిమా షూటింగ్ జరుగుతుంది కానీ అది ఎప్పుడూ పూర్తవుతుందో తెలియని పరిస్థితి.ఇలా వరుణ్ సందేశ్ కెరీర్ డోలాయమానం లో ఉంది.</br

కానీ వరుణ్ సందేశ్ కెరియర్ ఇలా ఉండి ఉండేది కాదేమో ఆ రోజు సుకుమార్ ఇచ్చిన మాట ప్రకారం సినిమా తీసి ఉంటే.ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటే 2010లో సుకుమార్ 100% లవ్ అనే సినిమాకు కథ సిద్ధం చేసుకుని ఫామ్ లో ఉన్న హీరోతో సినిమా చేయాలని ఆ కథ మొదటగా వరుణ్ సందేశ్ కి చెప్పాడు.ఎందుకంటే అప్పటికే హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం( Happy Days ) సినిమాలు విడుదలై అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు.కానీ ఆ తర్వాత ఎవరైనా ఎప్పుడైనా, కుర్రాడు, మరో చరిత్ర అంటూ మూడు ఫ్లాపులు వరుసగా చవిచూడాల్సి వచ్చింది.
దాంతో వరుణ్ సందేశ్ కి కథ చెప్పి షూటింగ్ డేట్స్ కోసం ఎదురు చూడమని చెప్పిన సుకుమార్ ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పటికే ఏ మాయ చేసావే సినిమాతో హిట్ కొట్టిన నాగచైతన్యతో తన సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు.హిట్ ఉన్న హీరోతో సినిమా చేయాలని సుకుమార్ అనుకోవడంలో తప్పులేదు.
కానీ వరుణ్ సందేశ్ కి ఓ మాట చెప్పి ఉంటే బాగుండేది.ఒకవేళ వరుణ్ సందేశం 100% లవ్ సినిమా తీసి ఉంటే ఈరోజు అతడు జాతకం మరోలా ఉండేది.