సుశాంత్‌కు ఇది తెలిసి ఉంటే ఖచ్చితంగా చనిపోయేవాడు కాదేమో

బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య విషయం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసింది.

ఆయన మృతి విషయంలో చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్‌ వ్యక్తం అవుతుంది.ఇప్పటికే బీహార్‌ ప్రభుత్వం సీబీఐకి విచారణకు సిఫార్సు చేసింది.

కాని మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సిద్దంగా లేదంటూ ప్రకటన వచ్చింది.సుశాంత్‌ కేసును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించాల్సిందే అంటే అతడి సోదరి సోషల్‌ మీడియా ద్వారా ఉద్యమం మొదలు పెట్టింది.

సీబీఐకి సుశాంత్‌ కేసు అప్పగించాలంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ ను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.ఆ హ్యాష్‌ ట్యాగ్‌ను కంగనా రనౌత్‌ తో పాటు ఎంతో మంది బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు ట్వీట్‌ చేయడంతో ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ఇప్పటి వరకు దాదాపుగా మూడు మిలియన్‌ ల ట్వీట్స్‌ సొంతం చేసుకుందట.ఇండియాలో 1.5 మిలియన్స్‌కు పైగా ట్వీట్స్‌ను రాబట్టుకోగా మిగిలిన మొత్తం కూడా వేరు వేరు దేశాల నుండి వచ్చాయి.ఈ హ్యాష్‌ ట్యాగ్‌ పై మొత్తం 15 దేశాల నుండి ట్వీట్స్‌ వచ్చాయంటూ ట్రెండ్‌ అనాలసిస్ట్ చెబుతున్నారు.

ఇంత మంది అభిమానం సొంతం చేసుకున్న సుశాంత్‌ ఈ విషయం కొంచెం ముందే తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు కాదు అంటున్నారు.ఇంత మంది అభిమానులు ఉన్న సుశాంత్‌ మృతి తీరని లోటు అంటూ అభిమానులు ఇంకా ఆయన జ్ఞాపకాల్లోనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు