Sugar Drinks : చక్కర పానీయాలు తీసుకోవడం వల్ల గుండెకు ప్రమాదమా..?

మన శరీర భాగాలలో గుండె( Heart ) అతి ముఖ్యమైనదని కచ్చితంగా చెప్పవచ్చు.ఇది సరిగ్గా పని చేయకపోతే ఇతర అవయవాల పై ప్రభావం పడుతుంది.

కొందరికి చక్కెర ఎక్కువగా ఉండే జ్యూసులు తాగే అలవాటు ఉంటుంది.గుండె ఆరోగ్యానికి ఇది ముప్పు అని దాదాపు చాలామందికి తెలియదు.

ఇప్పటి నుంచి చక్కెర పానీయాలు( Sugar Drinks ) తాగే అలవాటు తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజు మన శరీరంలో ఎంత చక్కర వెళుతుందో తెలుసుకోవడం చాలా మంచిది.

వ్యాధుల ప్రమాదాన్ని పెంచే పదార్థాలలో చక్కెర పానీయాలు కూడా ఉన్నాయి.ఇవి రుచికరమైనవే కావచ్చు.

Advertisement

కానీ ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే రెండు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ చక్కర పానీయాలు తాగడం వల్ల ఏట్రియాల్ ఫిబ్రిలేషన్ అని పిలవబడే క్రమ రహిత హృదయ స్పందన( Heart beat )కు దారి తీస్తుందని అధ్యయనంలో తెలిసింది.గుండె దమనలలో కొవ్వు కొలెస్ట్రాల్ మరియు ఇతర పదార్థాలు చేరడం వల్ల రక్త ప్రసరణకు( Blood Circulation ) ఆటంకం ఏర్పడుతుంది.కొలెస్ట్రాల్ మూలకాలను కలిగి ఉన్న డిపాజిట్లను ఫలకం అంటారు.

ఫలకం ఏర్పడే ప్రక్రియను అథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తారు.కొన్నిసార్లు ఈ ఫలకం చీలిపోయి రక్త ప్రవాహాన్ని అడ్డుకునే గడ్డగా ఏర్పడుతుంది.

ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

వీటిలో చాలా కెలరీలు ఉంటాయి.వీటిలో ఉండే అధిక చక్కెర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.చక్కర పానీయాలు తాగడం వల్ల కర్ణిక దడ అనేది ఒక ప్రధాన దుష్ప్రభావం.

Advertisement

షుగర్( Sugar ) అధికంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో హానికరమని పరిశోధకులు చెబుతున్నారు.వారానికి రెండు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ చక్కెర పానీయాలు తాగే వ్యక్తులలో గుండెపోటు ప్రమాదం 10% ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

అందుకోసం శీతల పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు