సుధీర్ బాబు ఏ మాయ చేసావే సినిమాలో చాల చిన్న క్యారెక్టర్ లో నటించి సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.
వాస్తవానికి అతడు ఒక సూపర్ స్టార్ కి అల్లుడు.
మరోక సూపర్ స్టార్ కి స్వయానా బావ.కానీ ఓవర్ నైట్ హీరో అవ్వాలనుకోలేదు.నటన చిన్నప్పటి నుంచి అతడికి ఫ్యాషన్ ఏమి కాదు.
కానీ సినిమా వాతావరణం అతడిని హీరోను చేసింది.ఏ మాయ చేసావే సినిమాకు మంజుల ఘట్టమనేని నిర్మాతగా వ్యవహరించింది.
దాంతో సుధీర్ బాబు కి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసే అవకాశం లభించింది.సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు పుల్లెల గోపి చాంద్ కి బ్యాడ్మింటన్ డబుల్స్ లో సుధీర్ పార్టనర్ గా ఆడేవాడు.
ఇక సింగిల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థాయికి ఎదిగాడు.ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆటకు దూరం అయ్యి మహేష్ బాబు సోదరి ని పెళ్లి చేసుకున్నాడు.
ఇద్దరు కొడుకులు పుట్టాక అతడికి హీరో అవ్వాలనే కోరిక పుట్టింది.ఇక మొదటి లీడ్ హీరో గా SMS అనే సినిమాలో నటించాడు.
ఈ సినిమాతో అతడిలోని నటుడికి మంచి మార్కులే పడ్డాయి.తనదైన న్యాచురల్ నటనతో అదరగొట్టాడు.
ఆ తర్వాత చేసిన శ్రీదేవి సోడా సెంటర్, శమంతకమణి, సమ్మోహనం వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి పెర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేశాడు.
ఈ సినిమాలు చూసినవారు ఎవరైనా సుధీర్ బాబు ని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల సమర్థుడు బాబు.ఇక సుధీర్ బాబు ప్రయోగాలు చేయడంలోనూ సిద్ధహస్తుడు.
ఇండస్ట్రీలో మరే హీరో చేయలేనని ప్రయోగాలు సుధీర్ బాబు చేయడం మెచ్చుకోవాల్సిన విషయం.సుధీర్ బాబు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలోనూ ముందు ఉంటాడు.
ప్రేమకథా చిత్రమ్, ఆడు మగాడ్రా బుజ్జీ, భలే మంచి రోజు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాలతో నయా దర్శకులకు అవకాశం కూడా ఇచ్చాడు.సరైన కథతో మంచి దర్శకుడు దొరికితే కలెక్షన్ కింగ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్న నటుడు సుధీర్ బాబు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy