భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య ఇంకా 11 మంది సభ్యులు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం తెలిసిందే.ఈ ప్రమాదం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆర్మీ ఉన్నతాధికారి దేశంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం.దారుణమని.
ప్రపంచవ్యాప్తంగా అనే వార్తలు వస్తున్నాయి.ఇటువంటి తరుణంలో బీజేపీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.
.బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని.డిమాండ్ చేశారు.
అంత మాత్రమే కాక ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ముందు అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది.కానీ వాస్తవానికి అది బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాదని అత్యంత నమ్మదగిన వర్గాల ద్వారా.
అందిన సమాచారం అని అది వాస్తవానికి సిరియన్ వైమానిక దళానికి చెందినదని, సీడీఎస్ ప్రయాణిస్తున్నది కాదని తెలిపారు.జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక, మరి కొందరు సీనియర్ మిలిటరీ అధికారులు ఎలా మరణించారనే దానిపై సందేహాలు వస్తున్నాయన్నారు.
ప్రభుత్వ తప్పనిసరిగా ఓ బయటి వ్యక్తి చేత విచారణ జరిపించాలని, సుప్రీం కోర్టు జడ్జి వంటి వారి చేత విచారణ జరిపించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.