కెనడాలో కాలేజీల మూసివేత : ఫీజు రీఫండ్ కోసం నిరీక్షణ.. లూథియానాలో పంజాబ్ విద్యార్ధుల నిరసన

కెనడాలోని మాంట్రియల్‌లో వున్న Collège de comptabilité et de secretariat du Québec (CCSQ), College de IEstrie (CDE), M కాలేజ్‌లు కోవిడ్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.దీంతో క్రెడిట్ ప్రోటెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే జనవరి 10న ఆకస్మాత్తుగా కాలేజీలు మూతపడ్డాయి.1,173 మంది భారత విద్యార్ధులు కెనడాలో వ్యక్తిగతంగా చదువుతుండగా.637 మంది విద్యార్ధులు కోవిడ్ కారణంగా భారత్‌లో ఇంటి నుంచి ఆన్‌లైన్ తరగతుల ద్వారా చదువుతున్నారు.ఈ మూడు కాలేజీలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేయడంతో దాదాపు 2000 మంది భారతీయ విద్యార్ధులు రోడ్డునపడ్డ సంగతి తెలిసిందే.

రైజింగ్ ఫీనిక్స్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న మూడు సంస్థలలో చేరిన భారతీయ విద్యార్ధులు.ఆకస్మిక మూసివేత కారణంగా ఇబ్బందులు పడ్డారు.రోజులు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో విద్యార్ధులు గత కొన్ని నెలలుగా ఆందోళన నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

వీరి పోరాటం ఫలించి సదరు మూడు కాలేజీలు ఇటీవల తిరిగి తెరుచుకున్నాయి.తరగతుల పున: ప్రారంభం వల్ల 2000 మంది భారతీయ విద్యార్ధులకు పెద్ద ఉపశమనం కలిగింది.అయితే కోవిడ్ కారణంగా భారత్‌లో ఆన్‌లైన్ ద్వారా చదువుకుంటున్న మరో 502 మంది విద్యార్దులకు కెనడా స్టూడెంట్ వీసా దొరుకుతుందో లేదోనన్న ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలోనే తమ ఫీజు వాపసు కోసం వేచి చూస్తున్నారు.ఏజెంట్ల చేతుల్లో మోసానికి గురయ్యామని, చివరికి స్టడీ వీసాలు సైతం తిరస్కరించారని.తాము చెల్లించాల్సిన ఫీజును తిరిగి చెల్లించాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు విద్యార్ధులు.

Advertisement

ఈ నేపథ్యంలో శుక్రవారం లూథియానాలోని ఫిరోజ్ గాంధీ మార్కెట్‌లో ఐడీపీ ఎడ్యుకేషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు.తాము ఇప్పటి వరకు చెల్లించాల్సిన పూర్తి ఫీజును తిరిగి చెల్లించడంలో సాయం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ఫీజులు తిరిగి ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ మూడు కాలేజీల్లో ఫీజు నిమిత్తం ఒక్కో విద్యార్ధి రూ.9 లక్షలకు పైగా చెల్లించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్ధి ఒకరు మాట్లాడుతూ.మాంట్రియల్‌లోని మూడు కళాశాలల్లో ప్రవేశం కోసం పెద్ద సంఖ్యలో విద్యార్ధులంతా ఏజెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.ఇందుకోసం ఏజెంట్లు తమ వద్ద నుంచి భారీగా కమీషన్‌ను వసూలు చేశారని ఆ విద్యార్ధి చెప్పాడు.

ఆ తర్వాత కెనడా ప్రభుత్వం ఆ కాలేజీలను నిషేధించిందని.స్టడీ వీసా తిరస్కరణ కారణంగా ఎడ్యుకేషన్ ఫీజు డిపాజిట్ కింద చెల్లించిన మొత్తాన్ని రీఫండ్ చేయాలని విద్యార్ధులు కోరుతున్నారు.ఏదైనా కారణం చేత వీసా తిరస్కరణకు గురైన పక్షంలో, పాలసీ ప్రకారం.45 రోజులలోపు ఫీజు రీఫండ్ చేయాలి.కానీ తాము గడిచిన తొమ్మిది నెలలుగా రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నామని ఆ విద్యార్ధి చెప్పాడు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

ఏజెంట్లు తమ జీవితాలను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

తాజా వార్తలు