మంత్రి ఉష శ్రీ చరణ్ కు వింత అనుభవం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల పంచాయితీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉష శ్రీ చరణ్ కు వింత అనుభవం ఎదురైంది.

నియోజకవర్గం లో రెండో రోజు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చరణ్ గోళ్ల పంచాయతీ పరిధిలోని పాతచెరువు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండు ఇళ్ల ముందు మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మన పార్టీది ఏం గుర్తు అని ప్రశ్నించగా అందుకు ఆ మహిళలు వెంటనే హస్తం గుర్తు అని చెప్పడంతో మంత్రి అవాక్కయింది.

కొందరు మహిళలు నవరత్నాల పథకాల పై అనర్గళంగా ప్రసంగించే వైసీపీ అభిమాన మహిళలను ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు.ఎన్నికల్లో మహిళగా ఉషశ్రీచరణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడంతో ఆమెకు అండగా నిలబడి, మేము ఓటువేశామని.

గ్రామానికి వచ్చిన మంత్రికి కనీస సమస్యలు వివరిస్తున్న సమయంలో వేరే వైపు వెళ్లడంతో ఆ మహిళలు మంత్రి ఉషశ్రీచరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తున్న విలేకరులను ఉద్దేశించి ఎల్లో మీడియా అంటూ విమర్శించారు.

Advertisement

గడప గడపకు మన ప్రభుత్వంలో అడుగడుగునా ప్రజా సమస్యలపై మంత్రి ఉషశ్రీచరణ్ తో ఏకరువు పెట్టిన మహిళలు ప్రజలు ముందస్తుగా వలంటీర్లు, లోకల్ వైసీపీ నాయకులు ,మహిళలను, ప్రజలను బుగ్గగింపులతో భారీ పోలీసులు బందోబస్తు నడుమ గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించడం పై తీవ్ర చర్చనీయంశమయింది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు