ఇరు తెలుగు సినిమా ప్రేక్షకులకి సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీనియర్ హీరో స్వర్గీయ కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు గడించాడు.
ఈ క్రమంలో సూపర్ స్టార్ గా వెలుగొందాడు, వెలుగొందుతున్నాడు.టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల లిస్టులో మహేష్ బాబు ముందుంటాడు.
అటు హీరోగా ఇటు నిర్మాతగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం ఆయనకు తెలియకుండానే జరిగిపోయిందని చాలా తక్కువమందికి తెలుసు.
1975 ఆగస్టు 9 న చెన్నై లో జన్మించిన మహేష్ బాబు ఆరేళ్ల వయస్సులో తన అన్నయ్య రమేష్ తో కలిసి విజయవాడ కి వెళ్లడం జరిగింది.మహేష్ పుట్టే నాటికి సూపర్ స్టార్ కృష్ణ 100 సినిమాలకు పైగా నటించి అగ్ర హీరోగా చలామణి అవుతున్నారు.సరిగ్గా ఆ సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రమేష్ “నీడ” అనే సినిమా చేస్తున్నాడు.
అందులో కీలకమైన బాల నటుడి పాత్ర ఉండడంతో మహేష్ అయితే బాగుంటారని దాసరి అనుకున్నారట.అయితే ఈ విషయం మహేష్ కి చెప్పకుండా, అతనికి తెలియకుండా షూట్ చేశాడు దాసరి.
దీంతో నీడ సినిమా ద్వారా తనకు తెలియకుండానే సినీ రంగ ప్రవేశం జరిగిపోయింది.
ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసే ఉంటుంది.మహేష్ బాల నటుడిగా అనేక సినిమాలలో నటించి మెప్పించాడు.ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ( Raghavendra Rao )దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించిన “రాజకుమారుడు( Raja Kumarudu )” సినిమా ద్వారా మహేష్ బాబు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఆ సినిమా తర్వాత మహేష్ తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.అప్పటినుండి ఇప్పటి వరకు చేసింది 27 సినిమాలే అయిన కానీ 8 నంది అవార్డ్స్ సొంతం చేసుకున్న ఏకైక హీరో మహేష్ బాబు.
రాజకుమారుడు సినిమా కు తొలి నంది అవార్డు అందుకున్న మహేష్ బాబు ఆ తర్వాత అనేక సినిమాలకు నందులు అందుకున్నాడు.ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ సినిమా చేయబోతున్నాడు.