దొంగలు చాలా తెలివైన వారిని చెప్పుకోవచ్చు.వారు ఇతరులను మోసం చేయడానికి ఊహించని రీతిలో ఆలోచన చేస్తారు.
పెద్ద పెద్ద దుకాణాలను కూడా వీరు ఇట్టే బురిడీ కొట్టిస్తుంటారు.ధూమ్ సినిమా లెవెల్‌లో వీరు చేసే దొంగతనాలు( thefts ) చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే ఒక పెద్ద స్టోర్ లో ఒక యువతి సెంటు బాటిల్స్ నుంచి ఇతర విలువైన వస్తువులను తీసుకోవడం చూడవచ్చు.ఆ తర్వాత ఆమె కౌంటర్ వద్దకు వచ్చింది.అయితే వాటికి బిల్లు చేయించడానికి బదులుగా రిటర్న్ ఇచ్చేందుకు వచ్చానని క్యాషియర్ వద్ద తెలిపింది.
అయితే దీనికి బిల్లు ఏది అని క్యాషియర్ అడిగాడు.బిల్లు లేదని, అవి చాలా కొత్తగా సీల్ తీయకుండా ఉన్నాయని, వాటిని వెంటనే తీసుకోవాలని ఆమె కోరింది.
అయితే బిల్లు లేకుండా ఆ వస్తువులను తాను తీసుకొని క్యాషియర్ స్పష్టం చేశాడు.దాంతో “సరే, నేను వాటిని తిరిగి తీసుకెళ్తాన”ని ఆమె విలువైన వస్తువులను చేత పట్టుకొని స్టోర్ నుంచి బయటికి వెళ్లిపోయింది.
నిజానికి ఆమె అవి షాప్ లో నుంచి వస్తువులను తీసుకుంది, చివరికి వాటిని రిటన్ కోసం తీసుకొచ్చానని నాటకమాడి, డబ్బు చెల్లించకుండానే చాలా దర్జాగా స్టోర్ రూమ్ నుంచి వెళ్లిపోయింది.ఈ విషయం క్యాషియర్ తెలుసుకోలేకపోయాడు.
ఆ విధంగా ఇదొక స్మార్ట్ దొంగతనం అయిపోయింది.

@TheFigen_ ఈ వీడియోను తాజాగా పంచుకుంది.దీనికి ఇప్పటికే 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన వారు ఇది ఆస్కార్ లెవెల్ దొంగతనం అని కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి దొంగతనం మేము ఎక్కడా చూడలేదని ఇది నెక్స్ట్ లెవెల్ థెఫ్ట్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ దొంగతనం చాలా స్మార్ట్ గా చేశారని, దీనిని తాము కూడా రియల్ లైఫ్ లో ఓసారి ట్రై చేసి చూస్తామని ఇంకొందరు కామెంట్లు చేశారు.
ఏది ఏమైనా ఇది 99% వర్కౌట్ కాకపోవచ్చు.దొరికిపోతే దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌లో కూడా అప్పగించే ప్రమాదం ఉంది.కాబట్టి ఈ వీడియోను లైట్ గా తీసుకోవడం మంచిది.







