తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారంలో దూకుడు పెంచింది.రేపటితో ప్రచారం ముగియనుండటంతో పార్టీ అగ్రనేతలు క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు.
ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఈ మేరకు భువనగిరి, గద్వాల్, కొడంగల్ లో ప్రచారం చేయనున్నారు.
అదేవిధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇల్లందు, డోర్నకల్ తో పాటు కొడంగల్ లో క్యాంపెయిన్ చేయనున్నారు.కాగా కొడంగల్ లో ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్నారు.
అలాగే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నర్సాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.అగ్రనేతల పర్యటన, ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది.
.






