సిక్కు అమరవీరులకు బ్రిటన్ ఘన నివాళి.. విక్టోరియా పార్క్‌లో స్మారక స్థూపం

బ్రిటన్ కోసం ప్రపంచ యుద్ధాల్లో పోరాడిన సిక్కు సైనికులకు ఆ దేశ ప్రభుత్వం ఘన నివాళి ఆర్పించింది.

లీసెస్టర్ నగరంలోని విక్టోరియా పార్క్‌లో ఆదివారం సిక్కు సైనికుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో భారతదేశానికి చెందిన సిక్కులు బ్రిటీష్ సైన్యంలో కీలకపాత్ర పోషించారు.ఆ సమయంలో సిక్కులు భారతదేశ జనాభాలో 2 శాతం కంటే తక్కువే వున్నారు.

కానీ బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో దాదాపు 20 శాతం సిక్కులే వుండేవారు.యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ క్యాంపస్ పక్కనే వున్న విక్టోరియా పార్క్ మైదానంలో గ్రానైట్ స్తంభంపై విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇది సెంటెనరీ వాక్‌లో భాగంగా వుంటుంది.ఈ ప్రాంగణంలో ఆర్చ్ ఆఫ్ రిమెంబరెన్స్ తదితర స్మారక చిహ్నాలు నెలకొని వున్నాయి.

Advertisement

తమది కాని దేశం కోసం వేల మైళ్లు ప్రయాణించి పోరాడిన వీరందరి త్యాగాలను గుర్తుచేసుకోవడం గర్వంగా వుందన్నారు వార్ మెమోరియల్ కమిటీ అధ్యక్షుడు అజ్మీర్ సింగ్ బస్రా. 1950ల నుంచి లీసెస్టర్‌లో సిక్కులు తమ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని బస్రా పేర్కొన్నారు.

దివంగత కౌన్సిలర్ కల్దీప్ సింగ్ భట్టి ఎంబీఈ, కళాకారుడు తరంజిత్ సింగ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు.సిక్కు ట్రూప్స్ మెమోరియల్ కమిటీ దీనికి అన్ని రకాల సహాయ సహకారాలను అందజేసింది.సిక్కు సమాజంతో పాటు స్థానికులు, సిటీ కౌన్సిల్ కమ్యూనిటీ వార్డు ద్వారా విగ్రహానికి నిధులు సమకూర్చారు.

విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సిక్కు యుద్ధ వీరుల కుటుంబాలు, లీసెస్టర్ సిటీ డిప్యూటీ మేయర్, కౌన్సిలర్ పియారా సింగ్ క్లైర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు