రెజ్లర్ ఆండ్రే ది జెయింట్ పేరు విన్నారా? ప్రపంచ రెజ్లర్ క్రీడాభిమానులకు ఈ పేరుని పరిచయం చేయవలసిన అవసరం లేదు.కానీ సామాన్య జనాలకి ఆ పేరుని పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.1970, 1980ల్లో రెజ్లింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన వ్యక్తి.ఫ్రెంచ్ ప్రొఫెషనల్ రెజ్లర్ అయిన ఇతడు మంచి నటుడు కూడా.
అధిక గ్రోత్ హార్మోన్ కారణంగా అతడికి భారీకాయం ఏర్పడింది.అయితే ఆ బలహీనతను అతగాడు బలంగా మార్చుకున్న తీరుని ప్రశంసించకుండా ఉండలేం.
7.4 అంగుళాల ఎత్తుతో, 236 కిలో గ్రాముల బరువుతో ఆండ్రే ది జెయింట్ ఆకారం చూసి ఆయనను ‘ప్రపంచపు ఎనిమిదవ వింత’ అని పేర్కొంటారు.ఇకపోతే తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడం విశేషం.సదరు వీడియోలో ఆండ్రే ది జెయింట్ తన అరచేతిని ఓ టీవీ యాంకర్ ముఖంపై పెడతాడు.
అయితే సదరు వ్యక్తి ముఖం మొత్తం ఆ అరచేతితో నిండిపోతుంది.దీంతో ఆండ్రే ది జెయింట్ చేతులు ఎంత పెద్దగా ఉండేవో ఈ వీడియో ద్వారా స్పష్టమౌతోంది.

బేసిగ్గా WWE రెజ్లర్లు లావుగా, ఎత్తుగా, చాలా బలంగా ఉంటారన్న సంగతి విదితమే.అయితే వారందరిలో కూడా ఆండ్రే ది జెయింట్ ఇంకాస్త ప్రత్యేకంగా కనబడతాడు.1966లో తన కెరీర్‌ను ప్రారంభించి, రౌసిమాఫ్ 1971లో ఉత్తర అమెరికాకు మకాం మార్చాడు.యునైటెడ్ స్టేట్స్, అలాగే జపాన్‌లో న్యూ జపాన్ ప్రో-రెజ్లింగ్ కోసం 1980ల రెజ్లింగ్ సమయంలో, రౌసిమోఫ్ WWWFకి ప్రధాన కొర్ గా నిలిచాడు.
ఇకపోతే ఆండ్రే ది జెయింట్ 46 ఏళ్ల వయసులో 1993, జనవరి 28న ప్యారీస్ లో హృదయ వైఫల్యంతో మృతి చెందటం అప్పటి రెజ్లర్ క్రీడా ప్రపంచానికి తీరలేని లోటు.







