తండ్రి కొడుకులతో సినిమా చేస్తున్న స్టార్ రైటర్...

ప్రస్తుతం నాగార్జున ( Nagarjuna )నా సామి రంగ అనే సినిమాని రిలీజ్ చేశాడు.

ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు ఇక కొన్ని ఏరియాలో ఈ సినిమా దారుణమైన ప్లాప్ అయ్యింది అంటూ వార్తలు వస్తుంటే, మరికొందరు మాత్రం ఈ సినిమా చూడ్డానికి ఓకే ఆవరేజ్ గా ఆడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి నాగార్జున ఈ సినిమాతో భారీ ఫ్లాప్ ని అయితే అందుకున్నట్టుగా జనాలు తేల్చేశారు.

మరి ఇలాంటి సమయంలో నాగార్జున ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఇక ఇప్పటికే రైటర్ ప్రసన్నకుమార్( Writer Prasanna Kumar ) బెజవాడ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న నాగార్జున ఇది ఎలాంటి సినిమా అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలగజేస్తుంది.ఇక ప్రసన్నకుమార్ ఇప్పటికే చాలా కమర్షియల్ సినిమాలకి రైటర్ గా చేసి ఉన్నాడు.

కాబట్టి ఇది కూడా కమర్షియల్ సినిమా అయితే మాత్రం నాగార్జునకు భారీ దెబ్బ పడే అవకాశాలు కూడా ఉన్నాయి.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇది ఒక డిఫరెంట్ జానర్ తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా, నాగచైతన్య కూడా ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.

మరి ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలైతే ఉన్నాయి.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తే గాని, ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో ప్రేక్షకుడికి ఒక క్లారిటీ అయితే రాదు.అయితే ఈ సినిమా తో నాగార్జున ఒక భారీ సక్సెస్ ని కొట్టడానికి పకడ్బందీ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

మరి మొదటి సినిమాతోనే నాగార్జున, నాగచైతన్య లని హ్యాండిల్ చేస్తున్న దర్శకుడిగా ప్రసన్నకుమార్ బెజవాడ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.

సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!
Advertisement

తాజా వార్తలు