ఈ నెలాఖరులో రిటైర్ కానున్న తరంజిత్ సింగ్ సంధూ.. అమెరికాలో గ్రాండ్ రిసెప్షన్

ప్రముఖ అమెరికన్ బిజినెస్ అడ్వకేసీ గ్రూప్.యూఎస్‌లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది.35 ఏళ్ల కెరీర్‌‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంధూ ఈ నెలాఖరులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) నుంచి పదవీ విరమణ చేయనున్నారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ)( USIBC ) బుధవారం ఈ రిసెప్షన్ నిర్వహించింది.

 Us India Business Council Hosts Reception For Outgoing Indian Ambassador Sandhu-TeluguStop.com

దీనికి వైట్‌హౌస్ , స్టేట్ డిపార్ట్‌మెంట్ , కార్పోరేట్ రంగానికి చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.గత కొన్నేళ్లుగా భారత్ అమెరికా సంబంధాలు బలోపేతం కావడానికి సంధూ కృషి చేశారని అతిథులు ప్రశంసించారు.

Telugu India, Taranjitsingh, India Council, Usibc, Washington Dc, White-Telugu N

వైట్‌హౌస్‌లోని ఇండో పసిఫిక్ జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త కర్ట్ కాంప్‌బెల్ మాట్లాడుతూ.సుధీర్ఘ కెరీర్‌లో తరంజిత్( Taranjit Singh Sandhu ) నాలుగు సార్లు అమెరికాలో పలు హోదాల్లో పనిచేశారని గుర్తుచేసుకున్నారు.ఇందులో మూడు సార్లు వాషింగ్టన్ డీసీ( Washington DC )లోని భారత రాయబార కార్యాలయంలో వున్నారని కాంప్‌బెల్ తెలిపారు.సంధూని తామంతా మిస్ అవుతామని, భారత్ అమెరికాలకు అతను అద్భుతమైన స్నేహితుడని కొనియాడారు.

ఇది ఆయనకు రిటైర్మెంట్ కాదని కాంప్‌బెల్ అన్నారు.

Telugu India, Taranjitsingh, India Council, Usibc, Washington Dc, White-Telugu N

యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ మాజీ దౌత్యవేత్త , ప్రస్తుత అధ్యక్షుడు అతుల్ కేశప్ మాట్లాడుతూ.యూఎస్ ఇండియా బంధానికి సంధూ కృషి చేశారని ప్రశంసించారు.ఆయన వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన దౌత్యవేత్తని అతుల్ కొనియాడారు.

సంధూ సాధించిన విజయాల్ని నేను వివరించాల్సిన అవసరం లేదని, చరిత్ర వాటిని రికార్డు చేస్తూనే వుంటుందని ప్రశంసించారు.ఇటీవలి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన విజయవంతం కావడానికి సంధూ కృషి చేశారని అతుల్ అన్నారు.

అనంతరం సంధూ మాట్లాడుతూ.ఇండో యూఎస్ సంబంధాలను బలోపేతం చేయడంలో యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవో క్యాంప్‌బెల్, కేశప్, నిషా దేశాయ్ బిస్వాల్ సహా పలువురు ప్రముఖులు పోషించిన పాత్రను హైలైట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube