పెళ్లి చేసుకోవడానికి చిల్లిగవ్వ లేదంటున్న స్టార్ సింగర్!

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలో ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ వల్ల పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని, దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఉద్యోగాలు కోల్పోయారని, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు 10 నుంచి 30 శాతం వరకు వేతనాలను తగ్గించారని పలు సర్వేల్లో తేలింది.

తాజాగా ఒక స్టార్ సింగర్ కరోనా, లాక్ డౌన్ వల్ల పెళ్లి చేసుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయిందని వెల్లడించారు.బాలీవుడ్ నటుడు, ప్లే బ్యాక్ సింగర్, టీవీ హోస్ట్ ఆదిత్య నారాయణ్ నటి శ్వేతా అగర్వాల్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

ఆదిత్య నారాయణ్ మాట్లాడుతూ కరోనా, లాక్ డౌన్ ప్రభావం తనపై కూడా పడిందని.తాను డబ్బులు లేక అనేక ఇబ్బందులను ఎదుకొంటున్నానని తన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

లాక్ డౌన్ వల్ల ఆదిత్య నారాయణ్ తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చైపోయిందని తెలిపారు.తాను గతంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టానని కరోనా, లాక్ డౌన్ ఆ పెట్టుబడులను సైతం వెనక్కు తీసుకునేలా చేసిందని అన్నారు.

Advertisement

కేవలం 18 వేల రూపాయలు మాత్రమే ప్రస్తుతం తన బ్యాంకు ఖాతాలో ఉందని అంతకు మించి తన దగ్గర డబ్బులు ఏమీ లేవని ఆదిత్య నారాయణ్ చెప్పుకొచ్చారు.బతకడానికి చివరకు బైక్ అమ్ముకోవాల్సి వస్తుందేమో.? అంటూ లాక్ డౌన్ వల్ల ఎదురైన కష్టాల గురించి వెల్లడించారు.కనీసం ఈ నెల నుంచైనా తనకు పని దొరకాలని లేకపోతే మనుగడ కష్టమంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కరోనా, లాక్ డౌన్ సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితిని తెచ్చిందంటే సామాన్యుల జీవనం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు